అమెరికా వణుకుతోంది.. ప్రపంచ దేశాలు సిద్ధం కావాల్సిందే?
ఒకవైపు వెనుకబడిన దేశంగా అగ్రరాజ్యాలు పిలుచుకునే భారత్లో ఇప్పటివరకు 150కోట్ల వ్యాక్సినేషన్ జరిగింది. కానీ అటు కేవలం 35 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో 60 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ అందించకలిగింది అక్కడి ప్రభుత్వం. అక్కడి ప్రజలకు ఉండే అతి స్వేచ్ఛ కారణంగా ఎవరు వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఇక వ్యాక్సిన్ వేసుకోవాలంటు ప్రభుత్వం సూచిస్తే ఉద్యమాలు చేపడుతున్న పరిస్థితులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఇలా వ్యాక్సిన్ వేసుకొని వారె అగ్రరాజ్యమైన అమెరికా కు శాపంగా మారిపోతున్నారు.
ఇలా వ్యాక్సిన్ వేసుకోకుండా ఉన్న వారి కారణంగానే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది అని ఇప్పటికీ అక్కడ నిపుణులు గుర్తించారు. కాగా ప్రస్తుతం అమెరికాలో దాదాపు పది లక్షలకు పైగా కేసులు ప్రతిరోజు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా చిన్న పిల్లలే ఉన్నారు అని అర్థమవుతుంది. ఐదేళ్లలోపు పిల్లల్లో ఎక్కువగా వైరస్ బారిన పడుతూ ఆసుపత్రుల పాలవుతున్నారట. ఐదు నుంచి పదేళ్ల లోపు పిల్లలు కూడా ఎక్కువ మొత్తంలోనే ఆస్పత్రి ఫాలు అవుతున్నారు అని అక్కడ నివేదికలు చెబుతున్నాయి. ఇలా కరోనా వైరస్ ప్రభావానికి అగ్రరాజ్యాన్ని వణుకు తున్న వేళ మిగతా దేశాలు కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.