పాపం బ్రిటన్.. ఇది ఊహించి ఉండకపోవచ్చు?

praveen
కనిపించని శత్రువుతో దాదాపు గత రెండేళ్ల నుంచి ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయి. కరోనా వైరస్ ఏ వైపు నుంచి వచ్చి దాడి చేసి ప్రాణాలను హరించుకుపోతుందో అని ప్రతి ఒక్కరు అనుక్షణం బాధపడుతూనే ఉన్నారు. ఒక దశ కరోనా వైరస్ పై పోరాటం చేసి విజయం సాధించాము అని అనుకునే లోపే ఊహించని విధంగా రూపాంతరం చెందుతున్న వైరస్ మరోసారి దూసుకొస్తోంది. దీంతో ప్రపంచ దేశాలలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చి చూస్తే అటు అగ్ర రాజ్యాలుగా కొనసాగుతున్న దేశాలలోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది అన్నది అర్ధమవుతుంది.



 అత్యాధునిక వైద్య సదుపాయాలు అద్భుతమైన మౌలిక వసతులు ఉన్నాయి. ఇక ప్రపంచ దేశాలలో మేమే నెంబర్ వన్ అంటూ చెప్పుకునే అగ్రరాజ్యాల లో ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తీరు చూస్తుంటే ప్రపంచ దేశాల భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రపంచ  దేశాల్లో నెంబర్వన్ మేమంటే మేమంటూ చెప్పుకునే అమెరికా బ్రిటన్ లో భారీగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాలో   రోజు పది లక్షలకు పైగా కేసులు వెలుగు లోకి వస్తుంటే బ్రిటన్లో రెండు లక్షల వరకు కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి రోజురోజుకీ.


 అయితే బ్రిటన్లో ప్రస్తుతం ఒక వైపు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోవడమే కాదు మరణాల సంఖ్య కూడా విపరీతంగా ఉంది. ఏ దేశంలో లేనంతగా బ్రిటన్లో మరణాల  సంఖ్య భారీగా పెరిగిపోయింది. మొత్తంగా చూసుకుంటే యూరోపియన్ యూనియన్ మొత్తంలో అటు బ్రిటన్ లోనే ఎక్కువ మరణాలు వెలుగులోకి వచ్చాయి అన్నది తెలుస్తోంది. అయితే కేవలం 35 కోట్ల జనాభా ఉన్న అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడానికి ముప్పు తిప్పలు పడుతూ ఉండడం విడ్డూరంగా ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: