తెలుగు ఐకాన్ స్టార్
అల్లు అర్జున్,
రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం పుష్ప..
డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది.. ఈ సినిమాలో
బన్నీ సరికొత్త లుక్ లో
బన్నీ కనిపించడం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో
సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ
సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరింది. పాన్
ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ప్రస్తుతం ఓటీటీ లోనూ అదరగొడుతోంది. కాక 'పుష్ప'లో
బన్నీ చెప్పిన ట్రేడ్ మార్క్ డైలాగులు సూపర్‌గా పేలాయి. ఇవి అభిమానుల తో పాటు పలువురు ప్రముఖులను ఆకట్టుకున్నాయి. ఇక నెటిజన్లు కూడా 'పుష్ప' డైలాగులను తమదైన స్టైల్లో అనుకరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల టీమిండియా క్రికెటర్
రవీంద్ర జడేజా, ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్
బన్నీ డైలాగుల ను తమదైన స్టైల్లో చెప్పి అలరించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో భారత ఆటగాడు శిఖర్ ధావన్ ఈ జాబితాలో చేరాడు.
పుష్ప… పుష్పరాజ్… మై ఝుకేగా నై ..అంటూ పుష్ప డైలాగ్‌ను చెప్పిఆకట్టుకున్నాడు. . కాగా తమ అభిమాన
హీరో పవర్ ఫుల్ డైలాగ్‌ని గబ్బర్ అదిపోయే రేంజ్ లో చెప్పడం తో
బన్నీ ఫ్యాన్స్
ఫిదా అవుతున్నారు. గబ్బర్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడే కాదు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే గబ్బర్ పలు
సినిమా పాటలు, డైలాగుల ను అనుకరించి ఆకట్టుకున్నాడు. కాగా గత కొంతకాలంగా బెంచ్‌కే పరిమితమవుతోన్న
ధావన్ జనవరి 19 నుంచి ప్రారంభంకానున్న దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు లో ధావన్ చోటు దక్కించుకున్నాడు. అందులో భాగంగా ప్రాక్టీస్ చేయనున్నట్లు తెలుస్తుంది...