టిడిపి నాయకుడు చంద్రయ్య హత్యకేసులో 8 మందిని అరెస్ట్ !
వెల్దుర్తి టిడిపి నాయకుడు చంద్రయ్య హత్యకేసులో 8 మందిని అరెస్ట్ చేశారు గుంటూరు పోలీసులు. ఈ హత్యకు ప్రధాన కారణం పాత తగాదాలు అని మా ప్రాధమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు గుంటూరు పోలీసులు. మృతుడు తోట చంద్రయ్య మరియు చింతా శివ రామయ్య గుండ్లపల్లి గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారన్నారు గుంటూరు పోలీసులు. 3 సంవత్సరాల క్రితం మృతుడు తోట చంద్రయ్య మరియు ముద్దాయి చింతా శివ రామయ్య మధ్య వారి ప్రాంతంలో వేసే సిమెంట్ రోడ్డు విషయంలో మధ్య గొడవలు జరిగాయని చెప్పారు గుంటూరు పోలీసులు. అప్పటినుండి వారి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని తెలిసిందని వెల్లడించారు గుంటూరు పోలీసులు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన గ్రామంలో తమ బంధువుల వేడుక కు హాజరైన తోట చంద్రయ్య, చింతా శివరామయ్యను చంపుతానని చెప్పాడని ప్రచారం జరిగిందని వెల్లడించారు గుంటూరు పోలీసులు. ఆ విషయం చింత శివరామయ్యకు బందువుల ద్వారా సమాచారం వచ్చిందన్నారు గుంటూరు పోలీసులు. అతను చంపడానికంటే ముందే నేనే చంద్రయ్య ను చంపాలని శివరామయ్య, తన కుమారుడు మరియు 6 గురు అనుచరుల సహాయంతో నిన్న హత్య చేయడం జరిగిందన్నారు గుంటూరు పోలీసులు.
నిందితుల వివరాలు ::
1.చింత శివ రామయ్య S/O పెద రామ కోటయ్య, 62 సంవత్సరాలు,
2.చింత యలమంద కోటయ్య S/O నారాయణ, 52 సంవత్సరాలు,
3.సాని రఘు రామయ్య S/O శంకరయ్య, 54 సంవత్సరాలు,
4.సాని రామకోటేశ్వరరావు S/O శంకరయ్య, 40 సంవత్సరాలు,
5.చింతా శ్రీనివాసరావు S/O శివ రామయ్య, 36 సంవత్సరాలు,
6. తోట ఆంజనేయులు S/O రాములు, 36 సంవత్సరాలు,
7. తోట శివ నారాయణ S/O హనుమయ్య, 38 సంవత్సరాలు,
8.చింతా ఆదినారాయణ S/O శివ రామయ్య, 35 సంవత్సరాలు