యూపీ ఎన్నికలు : అఖిలేష్ యాదవ్ పోటీ చేసేది ఎక్కడి నుంచో తెలుసా..?
సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి మెయిన్‌పురి జిల్లాలో అఖిలేష్ బరిలోకి దిగడంతో ఆ పార్టీకి కలిసి వస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని ప్రభావం సమీపంలో ఉన్నటువంటి ఇతర సీట్లపైనా పడుతుందని అంచెనా వేస్తూ ఉన్నారు. అజంగడ్‌లోని గోపాల్‌పూర్ స్థానం నుంచి అఖిలేష్ పోటీ చేస్తారని గతంలో ఊహగానాలు కూడా వినిపించాయి. ప్రస్తుతం కొత్త పేరు తెరపైకి రావడంతో చర్చ మొదలైంది.
ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ అజంగడ్ నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే.. అఖిలేష్ యాదవ్ తండ్రి, పార్టీ పోషకుడు అయినటువంటి ములాయంసింగ్ యాదవ్ పార్లమెంటరీ నియోజకవర్గం అయిన మెయిన్‌పురిలోని ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయవచ్చని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. మెయిన్‌పురి సమాజ్‌వాది పార్టీకి కంచుకోటగా ఉండటంతో అఖిలేష్ యాదవ్ ఈ స్థానం నుంచి పోటీ చేయడం సమీప స్థానాలను ప్రభావితం చేస్తున్నది.
అఖిలేష్ యాదవ్ మెయిన్‌పురి నుంచి పోటీ చేస్తే.. దాని ప్రభావం ఇతర సమీప జిల్లాలపై కూడా కనిపిస్తుంది. ఈ సీటుపై పోటీచేయడం మూలంగా కాన్పూర్, ఆగ్రా డివిజన్‌లలోని అనేక స్థానాలతో పాటు ఫిరోజాబాద్, ఎలా, ఔరయ్యా, ఇటావా, కన్నౌజ్‌తో సహా పలు స్థానాలు కూడా ప్రభావితం అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. ఈ జిల్లాలు సమాజ్‌వాదీ పార్టీకి ఎప్పటి నుంచో కంచుకోటగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో అఖిలేష్ రంగంలోకి దిగడంతో ఎస్పీకి చాలా రకాలుగా మేలు చేకూరుతుందని భావిస్తున్నాయి పార్టీ వర్గాలు.