అమరావతి : శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించారు సీఎం వైయస్. జగన్. శ్రీ సిటీలో నోవా ఎయిర్ ప్లాంట్‌ను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్.. రోజుకు 220 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుందని ప్రకటన చేశారు. 220 టన్నుల ఆక్సిజన్ తయారీ చేయడం చాలా ముఖ్యమైన విషయమని.. 14 నెలల్లో ప్లాంట్ ప్రారంభం కావడం అన్నది ఒక మైలురాయి అన్నారు సీఎం వైయస్. జగన్. ఇంత తక్కువ వ్యవధిలో ప్లాంట్ ప్రారంభం కావడం విశేషం... ఉపాధి లభించడం మంచి పరిణామమని వెల్లడించారు సీఎం వైయస్. జగన్. 144 పీఎస్‌ఏ ప్లాంట్లు కూడా వివిధ ఆస్పత్రుల్లో పెట్టామని.. మరో 32 ప్లాంట్లు కూడా పెడుతున్నామని స్పష్టం చేశారు సీఎం వైయస్. జగన్.
దీనివల్ల ఆక్సిజన్ విషయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని.. 24వేల ఆక్సిజన్ బెడ్లు తయారుచేశామని పేర్కొన్నారు సీఎం వైయస్. జగన్. కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినప్పుడు సరిపడా ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని.. రాష్ట్రంలో ఇప్పటివరకూ 300 టన్నుల ఆక్సిజన్ తయారీలో ఉందన్నారు సీఎం వైయస్. జగన్. ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి దీనికి అదనంగా వచ్చిచేరుతుందని.. కోవిడ్‌కే కాదు, పరిశ్రమలకూ ఆక్సిజన్ చాలా ముఖ్యమని చెప్పారు సీఎం వైయస్. జగన్. దేశంలో తొలిసారిగా ప్లాంట్ పెట్టామని.. ఏపీ సరైనదని ఎంచుకుని ఈ ప్లాంట్ పెట్టామని స్పష్టం చేశారు సీఎం వైయస్. జగన్. మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయమని.. 14 నెలల్లో ప్లాంట్‌ను నిర్మించామని.. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బాగా సహకరించిందని చెప్పారు. కోవిడ్ వేవ్‌ల సమయంలో రవాణాకు, మానవ వనరులకు కొరతలేకుండా అధి కా రులు చూశారని.. అందరికీ కృతజ్ఞతలు అన్నారు సీఎం వైయస్. జగన్. శ్రీ సిటీలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఉన్నాయని.. గ్యాసెస్ తయారీలో మాకు అపారమైన అనుభవం ఉందని చెప్పారు.