సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..నేతల్లో జోష్ ?
కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కె.విద్యాసాగర్ రావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ లు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్య వాదాలు తెలిపారు. ఈ సందర్భంగా.. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, ఎల్.రమణ, కౌషిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.
హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగం టి గోపీనాథ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి లు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్య వాదాలు తెలిపారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, భేతి సుభాష్ రెడ్డి, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సలీం తదిత రులు ఉన్నారు.