వామ్మో.. జర్మనీ ఏంటి ఇలా అనేసింది?
కాగా సరిహద్దుల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే అటు చిన్న దేశం అయినప్పటికీ రష్యాకు లొంగిపోయే ప్రసక్తి లేదని యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అంటూ ఉక్రెయిన్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే యూరోపియన్ యూనియన్, నాటో దేశాలు కూడా ఉక్రెయిన్ కు అండగా నిలబడతామని అంటూ చెబుతున్నారు. అయితే ఏకంగా ఆయుధ సహాయం చేయడానికి కూడా మేం సిద్ధమే అంటూ చెబుతున్నారు. దీంతో మరింత ధైర్యంగా రష్యాను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతుంది ఉక్రెయిన్.
ఇలాంటి సమయంలోనే మరో వైపు నుంచి గేమ్ నడిపిస్తున్న రష్యా అటు యూరోపియన్ యూనియన్ లో చీలికలు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే జర్మన్ ఇచ్చిన స్టేట్మెంట్ కాస్త సంచలనంగా మారిపోయింది. మేము ఉక్రెయిన్ కి మద్దతుగా దళాలను పంపించ లేము కానీ కేవలం ఒక 500 హెల్మెట్లు మాత్రం సహాయం చేయగలుగుతాము అంటూ జర్మనీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇలా యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్ కు మద్దతు పలకడం పై వెనుకడుగు వేస్తున్న నేపథ్యంలో అటు ఉక్రెయిన్ ధైర్యంగా ముందుకు సాగడానికి కాస్త ఆలోచనలో పడిపోయింది అని చెప్పాలి. రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది చూడాలి