బుర్ద్వాన్ హాస్పిటల్ లో ఘోర అగ్ని ప్రమాదం... ఒకరు మృతి
ఈ హాస్పిటల్ లో పని చేస్తున్న సిబ్బంది చెబుతున్న సమాచారం ప్రకారం సదరు వార్డ్ నుండి తెల్లవారు జామున పొగలు రావడం గమనించామని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం చలి కాలం కాబట్టి ఈ విషయాన్ని ఆ వార్డ్ లో ఉన్న రోగులు ఎవరూ గమనించలేకపోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం మంటలు చూసి అరవడం మొదలు పెట్టాడు. దీనితో అప్రమత్తమయినా హాస్పిటల్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే సమయం గడుస్తున్నా కొద్దీ మంటలు పెద్దగా అవడంతో కంట్రోల్ చేయడం వారి వల్ల కాలేదు. ఇక చేసేదేమీలేక ఆ వార్డ్ లో ఉన్న రోగులను బయటకు పంపడానికి ప్రయత్నించారు.
కానీ ప్రమాదవశాత్తూ అక్కడ ఒకరు మాత్రం అప్పటికే మంటల కారణంగా మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై హుటాహుటిన అయిదు మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ మంటలు మొదటగా దోమల కడ్డీల నుండి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పూర్తిగా హాస్పిటల్ నిర్వహణ మరియు రక్షణ పట్ల అభద్రతా, అజాగ్రత్తగా వ్యవహరించడం వలనే జరిగిందంటూ పలువురు విమర్శిస్తున్నారు.