మిసైల్ ప్రయోగం.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అమెరికా?

praveen
నియంత పాలన కు కేరాఫ్ అడ్రస్ అయిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ నియంతృత్వ ధోరణి మరింత పెరిగి పోయిందని తెలుస్తోంది. ఒకవైపు దేశంలో ఆర్థిక సంక్షోభం ఆహార సంక్షోభం వేధిస్తోంది. ఎంతో మంది ప్రజలు ఆహారం దొరక్క పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో ప్రజలందరి పట్ల కనీసం జాలి దయ చూపించటం లేదూ అధ్యక్షుడు కిమ్. ఆహార సంక్షోభాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇదే సమయంలో బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం పై ఉన్న మారటోరియం ఎత్తివేసి వరుసగా ప్రయోగాలు నిర్వహిస్తూ ఉండటం సంచలనంగా మారిపోయింది. వరుసగా బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలు చేస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్.. అగ్ర దేశాలకు శాంతి ఇస్తున్నాడు.


 కేవలం 2022 సంవత్సరం జనవరి నెలలో ఇప్పటివరకు ఏకంగా ఏడు పైగా క్షిపణుల ప్రయోగం చేపట్టడం సంచలనంగా మారిపోయింది. ఇక ఇటీవలే ఉత్తరకొరియా మరో భారీ క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు స్వల్ప శ్రేణి క్షిపణులను ప్రయోగాలు చేయగా ఇక ఇప్పుడు 2017 తర్వాత మొదటిసారి భారీ క్షిపణి ప్రయోగించింది.  భూమి నుంచి రెండు వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి దూసుకుపోయిన ఈ భారీ క్షిపణి జపాన్ సముద్రం లో పడిపోయింది. జపాన్ కి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో సముద్రంలో పడిపోవడం గమనార్హం.



 అయితే ఇప్పటికే ఉత్తర కొరియా వరుసగా క్షిపణుల ప్రయోగం చేస్తూ ఉండటంపై అగ్రరాజ్యమైన అమెరికా జపాన్ లాంటి దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయ్. ఇక ఇప్పుడు మరో సారి భారీ క్షిపణి ప్రయోగించడంతో దక్షిణ కొరియా అమెరికా జపాన్ దేశాలు మండిపడుతున్నాయ్. ఇక ఈ క్షిపణి ప్రయోగాలు నిబంధనలకు విరుద్ధం అంటూ అమెరికా వాదిస్తూ ఉండటం గమనార్హం. ఒక రకంగా చెప్పాలంటే  క్షిపణి ప్రయోగం తో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇక ఇటీవలే భారీ క్షిపణి ప్రయోగం తర్వాత ఉత్తర కొరియాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాము అంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: