రష్యాకి షాక్.. ఆ దేశం తెగించింది?

praveen
ఒకప్పుడు రష్యా తో కలిసి ఉండి ఆ తర్వాత వేరుపడి స్వతంత్ర దేశాలుగా ఉన్న పొరుగు దేశాల పై ఆధిపత్యం సాధించేందుకు రష్యా ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడానికి కారణం కూడా అదే. అయితే రష్యా చెప్పుచేతల్లో ఉంటూ బానిసలుగా బ్రతకలేము అంటూ ఎదురు తిరగడం కారణంగానే యుద్ధం చేసేందుకు కూడా సిద్ధమైంది రష్య. అయితే ఇలా పొరుగున వున్న అన్ని దేశాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అక్కడ పాలకులను కూడా తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటుంది రష్య.


 కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్ లాంటి దేశాలలో స్వతంత్ర దేశమని చెప్పుకుంటున్నారు తప్ప రష్యా చెప్పినట్లుగానే అక్కడ ప్రభుత్వ పాలన  కొనసాగుతూ ఉంది. ఇక కజకిస్తాన్ లో కూడా ఇదే పరిస్థితి. గతంలో ఏకంగా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించి కజకిస్తాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రష్యా. ఇలా ప్రజాస్వామ్యాన్ని కాలరాయడాన్ని వ్యతిరేకించిన ఎంతో మంది ప్రజలు ఉద్యమాలు చేపట్టగా.. ఇక రష్యన్ సైనికులు  మారణహోమం సృష్టించారు.. నిరసనలు చేపడుతున్న ప్రజలందరినీ దారుణంగా కాల్చిచంపారు. ఇక ఆ తర్వాత భయంతో అందరూ నిరసనలను నిలిపివేశారు అనే చెప్పాలి.



 ఇకపోతే ఇప్పుడు రష్యాని ఎదిరించేందుకు కజకిస్తాన్ ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి అన్నది తెలుస్తుంది. గతంలో ఎన్నికల సమయం లో రష్యా దళాలు కజకిస్తాన్ లో సృష్టించిన మారణహోమం పై అంతర్జాతీయ దర్యాప్తు బృందాలతో  ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించాలి అంటూ డిమాండ్ చేసాయ్ కజకిస్తాన్ ప్రతిపక్షాలు. ఇదే క్రమంలో మళ్ళీ ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ చెబుతున్నారు. ఇక ప్రతిపక్షాల డిమాండ్ను తోసిపుచ్చిన కజకిస్థాన్ అధ్యక్షుడు ఎలాంటి విచారణ జరపాల్సిన అవసరం లేదు అంటూ చెప్పారు. దీంతో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: