టీడీపీకి షాక్ ఇచ్చిన మాజీ మంత్రి మరణం...

VAMSI
మాములుగా రాజకీయాలలో ఒక స్థాయికి రావడం అంటే అంత ఈజీ కాదు. కొన్ని సార్లు మన పక్కన ఉన్న వారే మోసం చేస్తుంటారు. అయినా అన్ని పరిస్థితుల మధ్య రాజకీయాలలో కింది స్థాయి నుండి మంత్రి స్థాయికి చేరిన నాయకుడికి ప్రజలలో ఎంత మంచి పేరు ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఈ విధంగా కష్టపడి పైకి వచ్చిన నాయకులు చాలా మంది ఉన్నారు. అటువంటి వారిలో ఒకరే టీడీపీ నాయకుడు మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు (80). ఈయన ఆయన సొంత గృహంలో ఈ రోజు కన్నుమూశారు. టీడీపీ లో ఒక సీనియర్ నాయకుడు ఇప్పుడు చనిపోవడంతో పార్టీకి నిజంగా తీరని లోటు అని చెప్పాలి.


ఈయన మృతి పట్ల టీడీపీ నాయకులు మాత్రమే కాకుండా పలు పార్టీల నాయకులు సంతాపాన్ని తెలియచేస్తున్నారు. ఇకపోతే పెదపాడు మండలం నాయుడుగూడెం అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయన ప్రజలకు చేసిన సేవల గురించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెబుతూ తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈయన తన రాజకీయ జీవితంలో మొత్తం నాలుగు సార్లు టీడీపీ నుండి ఎమ్మెల్యే గా గెలిచారు. మరియు కేవలం ఒక్కసారి మాత్రమే మంత్రిగా చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే టీడీపీ చాల దారుణంగా ఉంది. అలాంటిది ఇటువంటి సమయంలో ఒక  మంచి లీడర్ ను కోల్పోవడం చాలా బాధాకరం అని తెలుస్తోంది.


ఇక రాష్ట్ర ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో చాలా దిగ్బ్రాంతికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఈయన స్వగృహంలోనే ఈయన అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.  ఈ వార్త టీడీపీకి ఒక షాక్ అని చెప్పాలి. మరి ముందు ముందు ఏ విధంగా టీడీపీ ని రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేస్తారో అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: