రష్యా కొత్త ప్లాన్.. ఉక్రెయిన్ దిగ్బంధనం?
ఇలాంటి సమయంలో అటు రష్యా మాత్రం మరింత ముందుకు వస్తుంది అన్నది తెలుస్తుంది. ఇప్పటికే ఉక్రెయిన్ కు చెందిన కొన్ని దీవులను రష్యా తమ అధీనంలోకి తెచ్చుకుంది. ఫిబ్రవరి మొదటి వారం కల్లా రష్యా పూర్తిగా ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది అన్నది ప్రస్తుతం ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయ్. ఇలాంటి నేపథ్యంలో రష్యా వ్యవహారశైలి కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. మొన్నటి వరకు కేవలం ఒకే వైపు నుంచి ఒక ఉక్రెయిన్ పై దాడి చేసేందుకు సిద్ధమైన రష్యా.. ఇప్పుడు మాత్రం ఉక్రెయిన్ ను దిగ్బంధనం చేసేందుకు సిద్ధమైంది అనేది తెలుస్తుంది.
లక్షల మంది సైనికులను ఉక్రెయిన్ చుట్టూ మోహరించింది. ఏకంగా నాలుగు దిక్కుల నుంచి రష్యాకు చెందిన సైనికులు ఉక్రెయిన్ పై దాడి చేసేందుకు సిద్ధమైపోయారు. కాగా ఒక వైపు నుంచి యూరోపియన్ యూనియన్, నాటో దేశాల మద్దతులేని సమయంలో అటు ఉక్రెయిన్ రష్యా తో సింగిల్ గా యుద్ధం చేయలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ ను రష్యా స్వాధీనం చేసుకోవడం ఖాయం అంటూ అంచనావేస్తున్నారు కొంతమంది నిపుణులు. ఇప్పటికే సరిహద్దులను సైన్యంతో దిగ్బంధం చేసిన రష్యా రానున్న రోజుల్లో ఎలాంటి ముందడుగు వేయబడుతుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.