తోటకు మళ్ళీ పవన్‌తోనే ఇష్యూ?

frame తోటకు మళ్ళీ పవన్‌తోనే ఇష్యూ?

M N Amaleswara rao
తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ ప్రభావం కాస్త ఎక్కువే ఉంటుందనే సంగతి తెలిసిందే...జనసేన పార్టీ గెలవకపోయినా...గెలుపోటములని మాత్రం బాగా ప్రభావితం చేయగలదు..2014, 2019 ఎన్నికల్లో గెలుపోటములని ఎక్కువగానే ప్రభావితం చేసింది...2014లో జనసేన టీడీపీకి సపోర్ట్ ఇవ్వడంతో...తూర్పులో ఆ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇక 2019 ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల టీడీపీ ఓట్లు చీలిపోయి...వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది.
ఇక జనసేన ప్రభావంతో 2014లో గెలిచిన వారు...2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అలా పవన్ ఎఫెక్ట్ వల్ల రామచంద్రాపురంలో తోట త్రిమూర్తులు...2014లో గెలవగా, 2019లో ఓడిపోయారు. 2019లో కేవలం 5 వేల ఓట్ల తేడాతో తోట...టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు..అయితే అప్పుడు రామచంద్రాపురంలో జనసేనకు 18 వేల ఓట్లు వచ్చాయి. అంటే జనసేన ఎలా ఓట్లు చీల్చిందో అర్ధం చేసుకోవచ్చు..అలా పవన్ ప్రభావంతో తోట ఓటమి పాలయ్యారని చెప్పొచ్చు.
అయితే ఓడిపోయిన తర్వాత తోట..వైసీపీలోకి వెళ్ళడం, అలాగే మండపేట ఇంచార్జ్‌ నియమించబడటం జరిగాయి. ఇక అనూహ్యంగా తోటకు ఎమ్మెల్సీ పదవి కూడా వచ్చింది. మండపేటలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీని వన్‌సైడ్‌గా గెలిపించేశారు. టీడీపీ సిట్టింగ్ స్థానంగా ఉన్న మండపేటలో వైసీపీ సత్తా చాటడం వెనుక తోట కృషి ఉంది..అందుకే ఆయనని ఎమ్మెల్సీ పదవి వరించింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో మండపేటలో టీడీపీ విజయాలకు బ్రేక్ వేసి..వైసీపీ జెండా ఎగరవేయాలని తోట పనిచేస్తున్నారు.. పైగా నియోజకవర్గంలో ఎలాగో తన సొంత సామాజికవర్గం కాపుల ఓట్లు ఎక్కువ..దీంతో ఆయనకు గెలుపు మరింత ఈజీ కానుంది.
అయితే తోటకు పవన్ రూపంలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం లేకపోలేదు...ఒకవేళ పవన్ సెపరేట్‌గా పోటీ చేస్తే ఇష్యూ లేదు..కానీ ఆయన, టీడీపీతో కలిస్తే మాత్రం మండపేటలో వైసీపీ గెలుపు సాధ్యం కాదు. టీడీపీ-జనసేనలు కలిస్తే మండపేటలో సులువుగా గెలిచేయొచ్చు. కాబట్టి మళ్ళీ తోటకు పవన్‌తో ఇబ్బంది ఎదురయ్యే ఛాన్స్ లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: