చలో విజయవాడ: ఇవాళ ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా..?

Chakravarthi Kalyan
ఉద్యోగ సంఘాలు నిర్వహించదలచిన చలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముందే అనుమతి లేదని చెప్పిన పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కార్యక్రమం జరగాల్సిన విజయవాడ బీఆర్‌టీఎస్‌ లో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకువాహన రాక పోకలు అనుమతించబోమని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు.


ప్రజల సౌకర్యం కోసం.. ఛలో విజయవాడ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అవేంటంటే..  సింగ్ నగర్ , వాంబే కాలనీ , కండ్రిక , నున్న వైపు నుండి బీఆర్‌టీఎస్‌  రోడ్డు ద్వారా నగరములోనికి వచ్చే వాహనదారులు , బుడమేరు మీదుగా  ప్రభాస్ కాలేజ్, FCI,  ఏలూరు లాకులు మీదుగా సిటీ లోనికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక దేవి నగర్, మధురానగర్, ముత్యాలంపాడు , సత్యనారాయణపురం వైపు నుంచి బీఆర్‌టీఎస్‌ రోడ్డు మీదుగా నగరములోనికి వెళ్ళే వాహనదారులు గవర్నమెంట్ ప్రెస్ మీదుగా జీఎస్‌ రాజు రోడ్‌ మీదుగా  సత్యనారాయణపురం పాత పోలీస్ స్టేషన్ మీదుగా ప్రభాస్ కాలేజ్, FCI, ఏలూరు లాకులు మీదుగా సిటీ లోనికి వెళ్ళాలి.


అలాగే.. రామవరప్పాడు, గుణదల వైపు నుండి వచ్చు వాహనదారులు , పడవలరేవు వద్ద నుండి ఏలూరు రోడ్ మీదుగా సిటీ లోనికి వెళ్ళాలి. ఇక గాంధీనగర్ , పెజ్జోనిపేట , కేదారేశ్వర పేట , అయోధ్యనగర్ వైపు నుండి బి.ఆర్.టి.ఎస్ . రోడ్డు మీదుగా సింగ్ నగర్ , నున్న వెళ్ళు వాహనదారులు , FCI, ప్రభాస్ కాలేజ్, సింగ్ నగర్ ఓవర్ మీదుగా వెళ్ళాలి.  వన్ టౌన్ , టూ టౌన్ , భవానిపురం , గొల్లపూడి , ఇబ్రహీంపట్నం , వైపు నుండి వచ్చే వాహనదారులు FCI, ఏలూరు లాకులు మీదుగా సిటీ లోనికి వెళ్ళాలి.

వన్ టౌన్ , టూ టౌన్ , భవానిపురం , గొల్లపూడి , ఇబ్రహీంపట్నం , వైపు నుండి వచ్చు వాహనదారులు , సింగ్ నగర్ మరియు నున్న వైపు వెళ్ళుటకు యర్రకట్ట మీదుగా ప్రభాస్ కాలేజ్,  సింగ్ నగర్ ప్లెఓవర్ మీదుగా వెళ్ళాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: