జిన్నా టవర్ వివాదం ముగిసిందా? వావ్ !
బీజేపీ అసందర్భంగా చేస్తున్న వ్యాఖ్యల కారణంగానే అశాంతికి కారణం అయ్యే వాతావరణం అన్నది నెలకొనేందుకు అవకాశం ఉందని వైసీపీ అంటోంది.గతంలోనూ ఇదే విధంగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరకాటంలో పడిన బీజేపీ, తరువాత సర్దుకుంది.ఇప్పుడు ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో మళ్లీ చెడ్డ పేరు తెచ్చుకుంటుంది. హిందుత్వ కార్డుతో రాజకీయాలు చేయాలనుకుంటున్న బీజేపీ, ఎప్పటికప్పుడు మత సంబంధ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటోంది.దీంతో ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతోంది. మతాల మధ్య ఐక్యత దెబ్బతినేలాచేస్తుంది. ఐక్యత దెబ్బతీసే విధంగా ఎవ్వరూ ప్రవర్తించకూడదని చెబుతూనే గుంటూరులో జిన్నా సెంటర్ చారిత్రక ప్రాధాన్యం ఉందని హోం మంత్రి సుచరిత అన్నారు.బీజేపీ అనవసర రాద్ధాంతాలు చేయకూడదని హితవు చెప్పారు .
గత కొద్ది రోజులుగా బీజేపీ రెచ్చగొడుతున్న వివాదాన్ని వైసీపీ పరిష్కరించి ప్రశాంతమయిన వదనంతో సమాధానం ఇచ్చి పరిష్కరించింది.దీంతో ఎప్పటి నుంచో రేగుతున్న వివాదం కాస్త సర్దుమణిగింది. నాయకులు జాతీయ భావాలు పెంపొందించుకునేలా ఉండాలని హోం మంత్రి మేకతోటి సుచిరత హితవు చెప్పారు. కుల,మతాల మధ్య విభేదాలు సృష్టించడం మానుకోవాలని కూడా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
గుంటూరు జిల్లాలో రేగుతున్న జిన్నా టవర్ వివాదం ముగిసిందనే అనుకోవాలి. టవర్ కు జాతీయ జెండా రంగులు వేసి, అక్కడే మువ్వన్నెల పతాకం ఎగుర వేసి స్థానిక నేతలు గొప్ప ముగింపు ఇచ్చారు.దీంతో ఈ గొడవ ఇక్కడితో ముగిసిందనే చెప్పాలి. హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా స్పందించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే పనులు ఎవ్వరూ కూడా చేయకూడదు అని బీజేపీకి హితవు చెప్పారు. వివాదాలు సృష్టించడంతో కొందరు తమ పబ్బం గడుపుకోవాలని భావిస్తుండడం బాధాకరం అని అన్నారు. ఐక్యతను పెంపొందించేలా ఎవ్వరైనా నడుచుకోవాలి, తద్వారానే సామాజిక ప్రశాంతత సాధ్యం అని చెప్పారు.