వైసీపీలో ఎంపీ పదవులను బీజేపీ నిర్ణయిస్తుందా?

Purushottham Vinay
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇక రాజ్యసభ సభ్యుల భర్తీ సందడి స్టార్ట్ కానుంది. ఈ సంవత్సరం జూన్లో దేశవ్యాప్తంగా కొన్న రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో భాగంగా ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం అనేది ముగుస్తుంది.ఇక ఈ నేపథ్యంలో ఈ స్థానాల భర్తీ కోసం వచ్చే నెల చివర్లో నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఏపీలో అధికార వైసీపీకి పూర్తి బలం ఉంది. అందువల్ల ఈ నాలుగు స్థానాలు ఆ పార్టీకే దక్కుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో జగన్ మోహన్ రెడ్డి ఎవరిని రాజ్యసభకు పంపుతారోనన్న ఆసక్తి కలుగుతోంది.ఆ నలుగురిలో ఒకరైన ఎంపీ విజయసాయిరెడ్డిని జగన్ కొనసాగించే ఛాన్స్ ఉంది. ఇక మిగిలిన మూడు స్థానాలపై సందిగ్ధత అనేది నెలకొంది. సాధారణంగా అయితే ఈ స్థానాలకు అభ్యర్థులను జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించాలి. కానీ ఈ రాజ్యసభ చోటు కోసం కొంతమంది నేతలు ఢిల్లీలో బీజేపీ దగ్గర లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం అనేది తెలుస్తుంది. తమకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఇప్పించాలని బీజేపీ అధిష్ఠానాన్ని కోరుతున్నారని సమాచారం అనేది తెలిసింది.


ఇక ఢిల్లీలోని బీజేపీ పెద్దలను కలుస్తున్న వీళ్లు జగన్ మోహన్ రెడ్డితో చెప్పి రాజ్యసభ ఎంపీ సీటు దక్కేలా చేయాలని కోరుతున్నారటా.ఇక దాంతో వైసీపీని నడిపిస్తోంది బీజేపీనా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.ఇప్పటికే ఏపీకి కేంద్రం ఎన్ని రకాలుగా అన్యాయం చేసినా కానీ సీఎం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక కేంద్ర బడ్జెట్లో ఏపీ ప్రస్తావనే లేకపోయినా జగన్ అసలు స్పందించనే లేదని ప్రధాని మోడీకి ఆయన భయపడుతున్నారని విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. అలాగే కేసులకు భయపడే జగన్ నోరు మొదపడం లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు రాజ్యసభ సీట్ల విషయంలోనూ పదవి ఆశిస్తున్న వాళ్లు నేరుగా జగన్ దగ్గరకు రాకుండా.. ఇక బీజేపీ దగ్గరకు వెళ్లడం అనేది అనేక సందేహాలకు తావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: