తెలంగాణ ఐఎఎస్ లపై అత్యాచార ఆరోపణలు ?

Veldandi Saikiran
ఢిల్లీ : తెలంగాణ ఐఏఎస్ అధికారి  పై అత్యాచార ఆరోపణలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి.  ఐఏఎస్ అధికారి కాళీచరణ్ పై ఢిల్లీ యువతి న్యాయ పోరాటం చేస్తోంది.  న్యాయం చేయాలంటూ సిఎమ్ కేసిఆర్ ను, సి.ఎస్ ను వేడుకుంటోంది బాధితురాలు.  ప్రస్తుతం తెలంగాణ బయోడైవర్సిటి బోర్డులో అధికారిగా పనిచేస్తున్నారు ఐఏఎస్ అధికారి కాళీచరణ్. ఐఏఎస్ అధికారి తన జీవితాన్ని నాశనం చేశారని,   తక్షణమే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని ఢిల్లీకి చెందిన ఓ యువతి డిమాండ్ చేస్తోంది. ప్రధాని కార్యాలయం, అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి, మహిళా కమిషన్ ఎవరూ పట్టించుకోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేయాలంటూ ఆ యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది.  “యాంటీసీపేటరీ బెయిల్” ను కోరుతూ ఐఏఎస్ అధికారి కాళీచరణ్   చేసుకున్న  దరఖాస్తును రద్దు చేయడమే కాకుండా, ఫిబ్రవరి 25న సెషన్స్ కోర్టు ముందు కాళీచరణ్ ను హాజరు పరచాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది పాటియాల కోర్టు. 


 2018 లో యువతిని ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో అత్యాచారం చేశాడు తెలంగాణ ఐఏఎస్ అధికారి కాళీచరణ్. సివిల్స్ పరీక్షకు సిధ్దం  అవుతున్న విద్యార్థినికి గైడ్ చేస్తానంటూ ఫేస్ బుక్ లో మాయమాటలు చెప్పి మచ్చిక చేసుకున్న కాళీచరణ్...  సివిల్స్ పరీక్షల నోట్స్ ఇస్తానని చెప్పి ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు తనను కాళీ చరణ్ర ప్పించారని యువతి ఆరోపణలు చేస్తోంది. నమ్మి వచ్చిన తనకు కాఫీలో మత్తు మందు ఇచ్చి  అత్యాచారం , ఆపై వీడియో చిత్రీకరణ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అశ్లీల వీడియోలు బయటపెడతా నంటూ బ్లాక్ మెయిల్ చేసి పదేపదే అత్యాచారం చేశారని ఢిల్లీ యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది.  2019లో తన తండ్రితో కలిసి పైఅధికారులను కలిసి వివరాలు అందజేసిన విద్యార్థిని...  పై అధికారులకు ఫిర్యాదులు చేస్తుండటంతో తన ఉద్యోగానికి ముప్పు ఉందని  గ్రహించాడు ఐఏఎస్ అధికారి కాళీచరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: