వేములవాడ రాజన్నకే కెసిఆర్ శఠ గోపం ?

Veldandi Saikiran
రాజన్న సిరిసిల్ల జిల్లా  : వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ రావు, ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదం అందజేసారు  అలాయ అర్చకులు.. సిరిసిల్ల జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న కేటిఆర్ నీవు సిరిసిల్ల, వేములవాడ రెండు కళ్ళు  అన్నావ్, సిరిసిల్ల కి ఎన్ని నిధులు పోయాయి..వేములవాడ కి ఎన్ని నిధులు ఇచ్చారన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.  వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పై వచ్చే బడ్జెట్ లో యువరాజు కేటిఆర్ ను, సీఎం కేసీఆర్ ను నిలదిస్తానని పేర్కొన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.  శివరాత్రి పేరిట హంగామా లో భక్తుల కోసం ఎన్ని ఖర్చు చేస్తున్నారు..విఐ పి ల కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. శివరాత్రి జాతరలో ఉన్న 550 వసతి గదులు ఉండగా విఐపి కోసం 400  వరకు ఇస్తున్నారని పేర్కొన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. 

యాదాద్రి కి ఒక న్యాయం..వేములవాడ రాజన్న ఆలయం పట్ల ఒక న్యాయమా.... వేములవాడ ఎమ్యెల్యే గుడికి ఎం చెయ్యాడు పట్టించుకోడని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రభుత్వం ఎం చేస్తుంది ఇప్పటి అయిన అభివృద్ధి చేయండి..వేములవాడ రాజన్న అంటే చాల శక్తిమంతమైన దేవుడు అని పేర్కొన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.  కానీ సీఎం కేసీఆర్ మాత్రం దేవుడికే శఠ గోపం పెట్టాలనుకోవడం ముర్కత్వం అన్నారు-  సీఎం కేసీఆర్ గారు మీరే స్వయంగా వేములవాడ కి వచ్చి చెప్పారు...రూ.400 కోట్లతో డెవలప్ చేస్తామని, ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ రావు, .  లక్షల మంది భక్తులు వస్తున్న కనీసం భక్తులకు సౌకర్యాలు కల్పించడం లేదని.. ఏటా 100 కోట్ల ఆదాయం దాటుతున్న భక్తుల సమస్యలు మాత్రం తీరడం లేదని ఫైర్ అయ్యారు.రంగుల రంగుల బ్రోచర్ల తో కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ రావు,  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: