సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశం.. ఎందుకో తెలుసా..!

MOHAN BABU
 చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాలన చేసిన నేత గా పేరు పొందారు. కానీ ఇప్పుడు ఆ నేత ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఈ సందర్భంలో ఆయన టిడిపి పార్టీ ని ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలు పు దిశగా పరుగులు పెట్టించాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నేతలందరిని కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో అనేక ఇబ్బందులతో నాయకులు ముందుకుపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ కంచుకోట. అయితే ఈ నియోజకవర్గంలో నాయ కుల మధ్యలో గ్రూప్ రాజకీయాలు రావడం వలన ఓటమి పాలైంది. 1994 నుంచి 2004 వరకు ఇప్పటికే మూడు దఫాలు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగి రింది. అంతటి ఘనత ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ  ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో చతికిల పడుతూ వస్తోంది.


దీన్ని దృష్టిలో పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ పార్టీని గాడిలో పెట్టాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు అని చెప్పవచ్చు. దీనికోసం ఆయన సరికొత్త ఆలోచనతో ఈరోజు పార్టీ సీనియర్ నేతలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పార్టీ యొక్క కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వచ్చి, ఆయనకు అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపి ఉద్యోగుల ఆందోళన, అలాగే ఉద్యోగులు ఇచ్చే పిఆర్సి వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళనపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటుగా కొత్త జిల్లాల ఏర్పాటు పై అధినేత చంద్రబాబు నేతలతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ మీద చర్చ జరపనున్నారు. ఏదిఏమైనా చంద్రబాబు సరికొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తూ, అటు ప్రజల్లో ఇటు నాయకులలో నూతనోత్సాహం నింపి ముందుకు కదిలితే తప్ప  అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: