పీఆర్సీ సమస్య: తగ్గేదేలే అంటున్న కమిటీ... ?

VAMSI
ఆంధ్ర ప్రదేశ్ లో పీఆర్సీ సమస్య ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ విషయమై ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు ఇంకా తమ పట్టును వీడడం లేదు. ఇప్పటికే ఉద్యోగులు అందరూ రోడ్లెక్కి ప్రభుత్వ పరువును గంగలో కలిపేశారు. అసలు ఈ సమస్య ఎక్కడికి వెళుతుంది అని మంత్రులు ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. నిన్న జరిగిన చలో విజయవాడ ఆందోళనలో కూడా నానా రభస జరిగింది. కానీ ప్రభుత్వం తరపు నుండి ఎంతసేపటికీ చర్చలకు రండి కూర్చుని మాట్లాడుకుకి పరిష్కరించుకుందాం అని వారిని జోకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సమస్య ఇప్పుడిప్పుడే సర్దుమణిగేలా లేదు అని క్లియర్ గా తెలుస్తోంది.

ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు అండగా వైసీపీ వ్యతిరేక పార్టీలు అన్నీ గొంతు కలుపుతున్నాయి. ఇది జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. సచివాలయంలోని ఉద్యోగులు కూడా పెన్ డౌన్ ను కొనసాగిస్తునారు. ఏ ఒక్కరూ కూడా తమ పనులకు హాజరు కాకుండా ఆందోళన చేపట్టారు. దీనితో ప్రభుత్వం కార్యకలాపాలు అన్నీ ఆగిపోయాయి. ఇంకాసేపట్లో పీఆర్సీ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో చర్చించే విషయాలను బట్టి ఆందోళన తీవ్రం కానుందా లేదా ప్రభుత్వంతో కూర్చుని మాట్లాడుతుందా అన్న వివరాలు తెలియనున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ప్రభుత్వం తరపున సీఎస్ చెప్పిన ప్రకారం వారితో సానుకూలంగా మాట్లాడుతారు.

ఇది కనుక ఫెయిల్ అయితే ముందు గానే చెప్పిన ప్రకారం ఫిబ్రవరి 7 నుండి అంటే సోమవారం నుండి సమ్మెను ఉదృతం చేయాలని అనుకుంటున్నారు. ఇలా ఆందోళనలు, సమ్మెలు, ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే ఉద్యోగ సంఘాలు ఫుల్ జోష్ లో ఉన్నాయని చెప్పాలి. మరి రాష్ట్ర భవిష్యత్తు ఏమిటో అర్ధం కావడం లేదు. జగన్ తర్వాత ఏమి స్టెప్ తీసుకోనున్నారు అనేది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: