అన్న..ఫ్యాన్స్ కవర్ చేయలేకపోతున్నారే?

M N Amaleswara rao
ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే ప్రధాన బలం అని చెప్పొచ్చు..అధికారంలో ఉన్నా, లేకపోయినా కార్యకర్తలే పార్టీ కోసం పనిచేస్తారు. అధికారంలో లేకపోతే...అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడతారు. అధికారంలో ఉంటే తమ పార్టీ జనాల్లో నెగిటివ్ అవ్వకుండా చూసుకుంటారు. ఇప్పుడు ఇదే పని ఏపీలో వైసీపీ కార్యకర్తలు చేస్తున్నారు. అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం కార్యకర్తలు ఎలా కష్టపడ్డారో చెప్పాల్సిన పని లేదు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ వల్ల అనేక ఇబ్బందులు పడిన సరే పార్టీ కోసం నిలబడ్డారు.

ఉన్నవి లేని ప్రచారం చేసి టీడీపీని నెగిటివ్ చేశారు..తమ పార్టీని పైకి లేపుకున్నారు. అసలు సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో వైసీపీ కోసం నిలబడ్డారో చెప్పాల్సిన పని లేదు. ఇక వారి కృషి ఫలితంగానే వైసీపీ భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చిందని చెప్పొచ్చు. అయితే అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ కార్యకర్తలు విశ్రమించడం లేదు. పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు. జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఆ నిర్ణయం వల్ల ఎంత వ్యతిరేకత వస్తుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. కానీ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది అద్భుతమని చెబుతూ, దానిపై వ్యతిరేకత రాకుండా కార్యకర్తలు కష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాజిటివ్‌గా ప్రచారం చేస్తూ ఉంటున్నారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వం చేసే తప్పులని కార్యకర్తలు కవర్ చేస్తున్నారని చెప్పొచ్చు.

ఇక తాజాగా ఉద్యోగులు ఏ స్థాయిలో ప్రభుత్వంపై పోరాడుతున్నారో చెప్పాల్సిన పని లేదు...తాజాగా వారు ఛలో విజయవాడ కార్యక్రమం పెట్టుకుని విజయవంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కాలేదని చెప్పి వైసీపీ ఫ్యాన్స్ కవర్ చేయలేక నానా ఇబ్బందులు పడ్డారు. టీడీపీ-జనసేన కార్యకర్తలే కార్యక్రమంలో ఉన్నారని, ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా అని ప్రచారం చేశారు. కానీ ఎంత కవర్ చేసినా సరే జనంలోకి వెళ్ళాల్సింది వెళ్ళిపోయినట్లే ఉంది. అంటే కార్యకర్తలు ఎంత కవర్ చేసిన ఉపయోగం లేకుండా పోయిందనమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: