కరోనా తగ్గుముఖంపై ఐసీఎమ్ఆర్ కీలక ప్రకటన..
మరోవైపు కరోనా పాజిటివ్ వచ్చిన వారి క్వారంటైన్ గడువు ముగిసిన తర్వాత కూడా వారి నుంచి వైరస్ వ్యాప్తి జరుగుతోందని తాజా పరిశోధనలో తేలింది. కొందరిలో వైరస్ ఉనికి 70రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటోందని.. మరికొందరు రోగులు 71నుంచి 232 రోజుల వరకు పాజిటివ్ గా ఉంటున్నారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీంతో వీరంతా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని పేర్కొన్నారు. అందుకే క్వారంటైన్ కాలాన్ని తగ్గించొద్దని హెచ్చరించారు.
మరో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ కు ఉప వేరియంట్ పుట్టుకొచ్చినట్టు డెన్మార్క్ లోని స్టాటెన్స్ సీరం ఇన్ స్టిట్యూట్ పరిశోధనకులు తెలిపారు. దీనికి బీఏ.2గా నామకరణం చేయగా.. ఇది ఒమిక్రాన్ కంటే మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు. మనుషుల్లో ఇమ్యూనిటీ నుంచి ఈ ఉప వేరియంట్ సులభంగా తప్పించుకోగలదని హెచ్చరించారు. అయితే వ్యాక్సిన్ తీసుకుంటే చాలా వరకు దీని నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు.
ఇక ప్రజల్లో రోగ నిరోధక శక్తి అధికంగా ఉండటంతో ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉందని అమెరికా పరిశోధకులు తెలిపారు. వ్యాక్సిన్లు తీసుకోవడం లేదా గతంలో వైరస్ బారిన పడి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఉండటం దీనికి ప్రధాన కారణాలన్నారు. అటు రీ ఇన్ ఫెక్షన్ కు గురిచేసే సామర్థ్యం ఈ వేరియంట్ కు తక్కువగా ఉండటంతోనూ లక్షణాలు తక్కువగా కనిపిస్తున్నాయన్నారు. వీలైనంత త్వరగా ప్రపంచంలోని అందరికీ వ్యాక్సిన్లు వేయాలని సూచించారు.