విజయసాయి రెడ్డి: 'ప్రత్యేక హోదా' విషయంలో తప్పు కేంద్రానిదే?
జగన్ కూడా ఇదే హామీని గట్టిగా వినిపించి ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి వచ్చాడు. కానీ ఇప్పటికీ ఆంద్ర ప్రదేశ్ ప్రజల మనస్సులో ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానిది తప్పుందా? లేదా రాష్ట్ర ప్రభుత్వానిది తప్పుందా అనే విషయాన్ని పక్కన పెడితే పని అయితే జరగలేదు. ఇదే విషయంపై తాజాగా వైస్సార్ సీపీ పార్లమెంటరీ నేత వైఎస్ విజయసాయిరెడ్డి కేంద్రం పై తన దైన స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇందులో భాగంగా పార్లమెంట్ సాక్షిగా ఈ రోజు రాజ్యసభలో కేంద్రంపై ధ్వజమెత్తారు. అయితే విజయసాయి రెడ్డి ఈ విషయంపై సూటిగా ప్రశ్నించారు.
గత మూడు సంవత్సరాల నుండి మేము కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు మాకు కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటోంది అని మాట్లాడారు. ఇప్పటికైనా ఈ విషయంపై ఆలోచించి ఆంధ్ర ప్రజలను ప్రత్యేక హోదాతో ఆదుకోవాలని తమ ఆంతర్యాన్ని సభకు తెలిపారు. మరి ఈ వ్యాఖ్యల పట్ల బీజేపీ నాయకులు ఏ విధంగా స్పందించనున్నారు అనేది తెలియాలంటే ఎదురు చూడాల్సి ఉంది.