గుడిసె పర్యాటకులకు చేదు వార్త..!

MOHAN BABU
తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి  పర్యాటకుల సందడి పెరుగుతుంది. దీంతో అక్కడికి చాలా మంది పర్యాటకులు విచ్చలవిడిగా నిబంధనలు పాటించకపోవడంతో వచ్చే నెల 20వ తేదీ వరకు అనుమతిని నిలిపేశారు. అయితే దీని కాలుష్య నివారణ విషయంలో మాత్రం ఎలాంటి మినహాయింపులు ఉండవని తెలియజేశారు అధికారులు. ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మాన్యంలో మారేడుమిల్లి ఉన్న గుడిసె అక్కడికి వచ్చే పర్యాటకులకు సొంతం. పర్యాటకుల మనసును దోచే అందాల కొండ గుడిసె. దీని యొక్క ప్రత్యేకతే వేరు.

మారేడుమిల్లికే వన్నెతెచ్చినటువంటి వనదేవతలకు కలికితురాయిగా పేరొందిన ప్రాంతం అది. అక్కడికి నిత్యం  వేలాది సంఖ్యలో పర్యాటకులు వస్తూ, వాహనాల రద్దీ పెరగడంతో పాటుగా ఆ ప్రాంతమంతా సందడిగా మారుతున్నది. మారేడుమిల్లి ప్రాంతంలోని జలపాతాలు, పర్యాటక ప్రదేశాలను అక్కడి అటవీ శాఖ ఆధ్వర్యంలో సి బిఈటీ ల ద్వారానే దాని అభివృద్ధి చేస్తున్నారు. పుల్లంగి పంచాయతీ పరిధిలోని ఈ కొండ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరుగాంచింది. ఈ పర్యటనలో రద్దీ పెరగడంతో ఆ ప్రాంతాన్నంతా కాలుష్యం ముంచేస్తోంది. పర్యాటకులు తెచ్చుకునేటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ మరియు కవర్లు ఇతరాత్రా వస్తువులతో విచ్చలవిడిగా చెత్త చెదారం పేరుకుపోయి చాలా ఇబ్బందిగా మారింది. అక్కడ రాత్రిళ్ళు మంటలు పెట్టుకోవడం, తగినటువంటి మద్యం బాటిళ్లను పగలగొట్టి పడేయడం ఇలాంటివి చేయడం వలన, అందమైన పచ్చని అందాల కొండ గుడిసెకు పర్యావరణ ముప్పు వాటిల్లుతుందని ఉద్దేశంతో పర్యాటకులను మార్చి 20 వరకు అనుమతించవద్దని అంటున్నారు.


ఈ గుడిసె ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అందుకోసమే రంపచోడవరం ఐటీడీఏ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. దీనిపై పి ఓ ప్రవీణ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులు చేయిస్తున్నారు. కొండ కింద ఉన్నటువంటి గుండ్రాతి వద్ద కాటేజీ ల నిర్మాణానికై ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ యొక్క రహదారి నిర్మించేందుకు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ వారు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అయితే దీన్ని నెల 20వ తేదీ వరకు పూర్తి స్థాయిలో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని  పనులు వేగవంతం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: