గుడ్ న్యూస్ చెప్పిన భారత శాస్త్రవేత్తలు..!
అంతేకాదు భారత్ లో మరో సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు అనుమతి లభించింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ అత్యవసర వినియోగానికి కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసింది. స్ఫుత్నిక్ వ్యాక్సిన్ ... రెండు డోసులు కాగా.. స్ఫుత్నిక్ లైట్ మాత్రం సింగిల్ డోస్ టీకా. అయితే స్ఫుత్నిక్ లైట్ టీకాను అత్యవసర వినియోగానికి మాత్రమే వాడాల్సి ఉంటుంది. గతంలో జాన్సన్ అండ్ జాన్సర్ వారి సింగిల్ డోసు టీకా కూడా అనుమతి పొందింది.
ఇక మన దేశంలో టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. 15 నుండి 18ఏళ్ల మధ్య వయసున్న టీనేజర్లు టీకా తీసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5కోట్ల మందికి పైగా యువత ఫస్ట్ డోస్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు.కరోనాతో పోరాటంలో యంగ్ ఇండియా ఉత్సాహంగా ముందుకు సాగుతోందని ఆయన అభివర్ణించారు.
మరోవైపు మనదేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24గంటల్లో 67వేల 597పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోపక్క మరణాలు పెరుగుతున్నాయి. గత 24గంటల్లో 1,188మంది మరణించారు. లక్షా 80వేల 456మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 9లక్షల 94వేల 891 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 5.02శాతంగా ఉంది. ఇప్పటి వరకు 5లక్షల 2వేల 874మది చనిపోయారు. చూద్దాం.. అన్ని కరోనా వేరియంట్లకు ఒకే మందును రూపొందిస్తున్న శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఎంతవరకు వస్తాయో.