ఒమిక్రాన్ కంటే ఆ వేరియంట్ ప్రమాదమట..!
ఇక కరోనా ముప్పుపై డబ్ల్యూహెచ్ ఓ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్ధాల పాటు ఉంటుందని.. వైరస్ సోకే ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. ఇక కామన్వెల్త్ దేశాల్లో కేవలం 42శాతం, ఆఫ్రికా దేశాల్లో సగటు వ్యాక్సినేషన్ రేటు కేవలం 23శాతమేనని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీలో దేశాల మధ్య వ్యత్యాసం ఉందని.. అలా కాకుండా అందరికీ అందించడమే డబ్ల్యూహెచ్ ఓ ఉద్దేశమని టెడ్రోస్ పేర్కొన్నారు.
మరోవైపు అమెరికాలో కరోనా విజృంభిస్తోంది. మొత్తం మరణాల సంఖ్య ఏకంగా 9లక్షలు దాటింది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈ స్థాయిలో కొవిడ్ మరణాలు సంభవించలేదు. ఆ తర్వాత 6లక్షల మరణాలతో బ్రెజిల్ రెండో స్థానంలో.. 5లక్షల మరణాలతో భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. 50రోజుల వ్యవధిలోనే లక్షల మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారని ఓ నివేదిక తెలిపింది.
ఇక మనదేశం విషయానికొస్తే.. కరోనాతో అనాథలైన వారిని.. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిని పెద్ద మనసుతో ఆదుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇందుకోసం సీఎం ఆఫీసులో డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్ గా నియమించాలని తెలిపింది. అర్హులైన బాధితులంతా పరిహారం కోసం దరఖాస్తు చేసుకునేలా చూడాలని సూచించింది. వారంలోగా సమీక్షించి పరిహారం అందజేయాలంది.లేదంటే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. కొత్త వేరియంట్ ప్రమాదంపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుండటంతో ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.