దివ్యవాణికి సీటు ఫిక్స్?
ఇక సీనియర్ నటి దివ్యవాణి సైతం రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే...గత ఎన్నికల ముందు ఈమె టీడీపీలోకి వచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయినా సరే టీడీపీ తరుపున పనిచేస్తున్నారు. టీడీపీ తరుపున బలమైన వాయిస్ వినిపించడంలో దివ్యవాణి ముందున్నారు. అలాగే అమరావతి ఉద్యమంలో కూడా కీలకంగా ఉంటున్నారు...ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.
అయితే ఆ మధ్య పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని చెప్పి దివ్యవాణి..టీడీపీని వీడటానికి సిద్ధమయ్యారని కథనాలు కూడా వచ్చాయి...కానీ దివ్యవాణి పార్టీ వీడలేదు..కాకపోతే ఈ మధ్య ఆమె పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. మరి ఆమె ఏమన్నా వ్యక్తిగత ఇబ్బందులు వల్ల సైలెంట్ అయ్యారా? లేక పార్టీ సైలెంట్ చేసిందా అనేది క్లారిటీ లేదు. కాకపోతే తాజాగా దివ్యవాణికి వచ్చే ఎన్నికల్లో సీటు దక్కనుందని టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
దివ్యవాణికి ప్రత్తిపాడు సీటు ఇవ్వొచ్చని..హోమ్ మంత్రి సుచరితపై దివ్యవాణి పోటీ చేస్తారని ప్రచారం మొదలైంది. ఎలాగో దివ్యవాణి కూడా సుచరిత మాదిరిగా కన్వర్ట్ క్రిస్టియన్ కాబట్టి..ఆమె అయితేనే ప్రత్తిపాడులో వైసీపీని ఓడించడానికి సరైన అభ్యర్ధి అని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే ప్రత్తిపాడు సీటు విషయంలో చంద్రబాబు ఇంకా ఏమి తేల్చలేదు. ఇప్పుడు అక్కడ టీడీపీ ఇంచార్జ్‌గా మాకినేని రత్తయ్య ఉన్నారు. మరి ప్రత్తిపాడు సీటు ఆయనకు ఇస్తారో...లేక వేరే నేతకు ఇస్తారో క్లారిటీ లేదు. దివ్యవాణికి కూడా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.