గుడ్ న్యూస్: కరోనా నివారణకు నాజిల్ స్ప్రే...
శానోటైజ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకొని మన దేశంలో ఫాబిస్ప్రే ను అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది. ఈ స్ప్రే ను తీసుకున్న కేవలం రెండు నిమిషాల్లోనే ప్రభావం చూపుతాయని అలాగే 24 గంటల్లోనే ప్రభావవంతంగా పని చేస్తూ వైరస్ ను తగ్గిస్తుందని నిపుణులు తమ అధ్యయనం ద్వారా వివరించారు. ఈ స్ప్రే చాలా సురక్షితమని నిర్దారించారు. క్లినికల్ ట్రైల్స్ సమయంలో ఈ స్ప్రే మంచి ఫలితాలను ఇవ్వడంతో తమ అధ్యయనాన్ని ముందుకు తీసుకెళ్లి సక్సెస్ అయినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ నైట్రిక్ ఆక్సైడ్ నాజిల్ స్ప్రే ను తయారు చేయడం, అలాగే మార్కెటింగ్ చేయడం కొరకు ఫార్మా కంపెనీకి భారత్ డ్రగ్ రెగ్యులేటరీ డిసిజీఐ అనుమతులు ఇచ్చింది.
సీనియర్ విపి డాక్టర్ మోనికా ఈ అంశం గురించి మాట్లాడుతూ ఈ స్ప్రే వేగంగా సురక్షితంగా పనిచేస్తుందని తెలిపారు. ఇది కరోనా సోకినా పేషెంట్ ను కాపాడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో వివిధ రకాల కరోనా వేరియంట్ లు ప్రజలను భయకంపితులను చేస్తున్న క్రమంలో ఈ నాజిల్ స్ప్రే సేఫ్ అని తెలుస్తోంది. ఈ స్ప్రే ల వలన 99 శాతం ప్రమాదం ఏమీ ఉండదని కోలుకుంటారని వారు తెలియచేస్తున్నారు. ఈ స్ప్రే ముఖ్యంగా పెద్దలకు ఉపయోగపడనుంది.