ఇక జీవం పుట్టుకకు సంబంధించిన రహాస్యాలను తెలిపే ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే తాజాగా శాస్త్రవేత్తలు జీవం పుట్టుకకు సంబంధించిన మరో కారణాన్ని కనుగొనడం జరిగింది. అదే సూపర్ మౌంటైన్స్ అట.జీవం పుట్టుక అనేది అసలు ఈ నాటిది కాదు. ఇప్పటి దాకా జీవ పరిణామ క్రమంలో చాలా మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. ఇక ముందుగా ఆవిర్భవించిన ఏక కణ జీవి అమీబా నుంచి నేటి మనిషి పుట్టుక దాకా జరిగిన పరిణామ క్రమంలో చోటు చేసుకున్న అంశాలను తాజాగా వివరించారు శాస్త్రవేత్తలు. దీనిపై ఎన్నో సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ పరిశోధనల ఫలితంగా సూపర్ మౌంటైన్స్ ను కనుగొన్నట్లు పేర్కొనడం జరిగింది.ఇక జీవం పుట్టుకకు ప్రధాన కారణంవచ్చేసి భూమి ఉద్భవించడం. అయితే ఈ భూమి కూడా సూపర్ మౌంటైన్స్ కారణంగా ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది 2 వేల నుంచి 18 వందల మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని తెలిపారు.
ఈ సూపర్ మౌంటైన్స్ హిమాలయాల కంటే కూడా చాలా పురాతనమైనవని పేర్కొన్నారు. వీటి కారణంగానే జీవం పుట్టుక ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.సూపర్ మౌంటైన్స్ అనేది రెండు సార్లు ఏర్పడగా.. ఇక మొదటిసారి ఏర్పడినప్పుడు వాటి పైన ఉన్న మంచు కరగడం ప్రారంభించిందని తెలిపడం జరిగింది. ఇక దీనితోనే మొదటిసారిగా జీవం ఏర్పడినట్లు పేర్కొన్నారు.ఇక ఇదిలా ఉంటే ఈ జీవం పుట్టుకకు ఆధారం అయిన లుటిటియం జిర్కాన్ ల జాడను కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టడం జరిగింది. ఇది ఏర్పడినప్పుడు భూమిపై ఆక్సిజన్ కూడా లేదని వారు తెలిపారు.ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ఆక్సిజన్ కూడా ఏర్పడిందని వారు వివరించారు. ఇలా క్రమక్రమంగా ఆక్సిజన్ కూడా జీవుల పెరుగుదలకు అనుగుణంగా పెరుగుతూ వచ్చిందని శాస్త్రవేత్తలు అన్నారు. ఇందుకు సంబంధించిన పరిశోధనల కాపీని ఎర్త్ అండ్ ప్లానిటరీ అనే సైన్స్ జనరల్ లో ప్రచురితం చేయడం జరిగింది.