పసుపు కాదు కారం : మళ్లీ వివాదంలో రంగా..ఎన్టీఆర్ కూడా?

RATNA KISHORE
వివాదాల‌కు కేరాఫ్ గా నిలిచే నేత‌ల‌తో మాట్లాడించ‌డం ఇప్పుడు చాలా సులువైన ప‌ద్ధ‌తి అన్నది ఓ సుస్ప‌ష్టం అయిన విష‌యం. ఆ విధంగా మ‌ళ్లీ పేర్ల వివాదంతో జ‌గ‌న్ ను ఇర‌కాటంలో ఉంచి అటు కాపు  సామాజిక‌వ‌ర్గం మద్ద‌తును, ఇటు క‌మ్మ సామాజిక‌వ‌ర్గం మ‌ద్ద‌తును తామే అందుకోవాల‌న్న‌ది టీడీపీ వ్యూహంగా ఉంది.అందుకే ఏక కాలంలో రెండు వివాదాల‌కు తావిచ్చేందుకు వీలుంగా బోండా ఉమా లాంటి టెరిఫిక్ లీడ‌ర్స్ సీన్లోకి వ‌చ్చారు. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...
జిల్లాల విభ‌జ‌న కారణంగా ఎటువంటి లాభం లేద‌ని టీడీపీ అంటోంది.తాజాగా కొత్త పోరుకు సిద్ధం అవుతున్న నేప‌థ్యంలో వివాదాస్ప‌ద నేత‌ల‌ను ముందు వ‌రుస‌లో ఉంచుతోంది.చంద్ర‌బాబు రాజ‌కీయ చ‌తుర‌త‌లో భాగంగా ఆయ‌న మాట్లాడ‌డం లేదు కానీ బోండా ఉమా లాంటి నేత‌ల‌ను రంగంలో ఉంచి మాట్లాడిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు  మండిప‌డుతున్నారు.అయితే పేర్ల వివాదాన్ని ఇప్ప‌టికే మంత్రి కొడాలి నాని కొట్టిప‌డేశారు.ఎన్టీఆర్ అంద‌రి వాడు క‌నుక ఆయ‌న పుట్టిన నిమ్మ‌కూరు ఉన్న ప్రాంతం మ‌చిలీపట్నంలో ఉంది క‌నుక అక్క‌డే ఆ ప్ర‌తిపాదిత జిల్లాకే పేరు పెట్ట‌డం అన్న‌ది సమంజ‌సం కాద‌ని అన్నారు. ఎప్ప‌టి నుంచో తాము కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాల‌ని అనుకున్నామ‌ని అది ఈ విధంగా నెర‌వేర్చుకుంటున్నామ‌ని, ఇందులో వివాదాల‌కు తావేలేద‌ని అంటున్నారీయ‌న. కానీ టీడీపీ మాత్రం త‌న‌దైన భాష్యం ఒక‌టి వెతుక్కుంటోంది. జిల్లాల ఏర్పాటే అస‌లు స‌హేతుకం కాద‌ని, అదొక దండ‌గ‌మారి చ‌ర్య అని అభివ‌ర్ణిస్తోంది.
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వివాదాలు రేగుతూనే ఉన్నాయి.ఒక‌దాని త‌రువాత ఒక‌టి అన్న‌విధంగా వ‌స్తున్నాయే కానీ ఆగ‌డం లేదు.ముఖ్యంగా పేర్ల‌కు సంబంధించి టీడీపీ ప‌ట్టిన ప‌ట్టు వీడ‌డం లేదు.వాస్త‌వానికి విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్పాట‌య్యే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా పేరు పెట్టారు. కానీ ఆ విధంగా కాకుండా అదేవిధంగా మ‌చిలీప‌ట్నం కేంద్రంగా ఏర్పాట‌య్యే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాల‌ని, అదేవిధంగా విజ‌య‌వాడ కేంద్రంగా ప్ర‌తిపాద‌న‌లో ఉన్న కృష్ణా జిల్లాకు వంగ‌వీటి  రంగా పేరు పెట్టాల‌ని పట్టుబ‌డుతూ వివాదాస్ప‌ద టీడీపీ నాయ‌కుడు బోండా ఉమా దీక్ష‌కు కూర్చొన్నారు.అదే విధంగా విభిన్న వాదాలు రేగుతున్న నేపథ్యంలో రంగాకు  త‌గిన న్యాయం చేయాలంటే త‌మ ప్ర‌తిపాద‌న‌కు ప్ర‌భుత్వం అంగీకారం తెల‌పాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఇక బోండా ఉమా దీక్ష‌కు రంగా-రాధ మిత్ర మండలి స‌భ్యులు కూడా మ‌ద్ద‌తు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: