జనగామ జిల్లాలోని భారతీయ జనతా పార్టీ నాయకులను కలిసేందుకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కరీంనగర్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే... ఈ సమాచారం మేరకు పెద్ద ఎత్తున పోలీసులు ఈటల రాజేందర్ నివాసానికి చేరుకుని ఆయనను గృహనిర్బంధంలో ఉంచారు. నిన్న జనగామలో టిఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యకర్తల పై చేసిన దాడిలో గాయపడిన వారిని పరామర్శించడానికి వెళ్ళడానికి వీలు లేదంటూ హౌస్ అరెస్ట్ చేశారు హైదరాబాద్ నగరానికి చెందినటు వంటి పోలీసులు. అయితే.. అన్యాయమైన అ రెస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటెల రాజేందర్.. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉండాలి.. కానీ ధర్నాలు చేయడానికి, నిరసనలు చెప్పడా నికి టిఆర్ఎస్ పార్టీ వారికి మాత్రమే అనుమతులు ఉంటాయా? అని నిప్పులు చెరిగారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.
దాడులు జరిగితే పోలీసులు వారి పక్షాన నిలుస్తారా ? అని ప్రశ్నించారు హుజురాబాద్ ఎమ్మె ల్యే ఈ టల రాజేందర్. ఇది ఎక్కువ కాలం చెల్ల దని సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీఆ ర్ ఎస్‌లు కలిసి పోటీ చేసే అవకాశం ఉందన్న వదంతులను బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కొట్టిపారేశారు. మీడియా ప్రశ్నలకు సమాధానంగా, హు జూ రా బాద్ బిజెపి ఎమ్మెల్యే హుజూరాబాద్ స్థానాన్ని వదిలిపెట్టాలని అనుకోవట్లేదని, ఎందుకంటే తాను హుజూరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తు న్నందున మరియు ఏడుసార్లు ఎన్నికైనందున అన్నారు. 'వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేయమని పార్టీ హైకమాండ్ చెబితే తప్పకుండా చే స్తా ను' అని మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. తనకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ ఎమ్మెల్యే మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.