ఏపీ గుడ్‌న్యూస్: ఉగాది నుంచే కొత్త జిల్లాలు..?
కొత్త జిల్లాల ప్రక్రియ ఎలాంటి అయోమయం లేకుండా సాఫీగా సాగాలని.. కొత్త జిల్లాల్లో పాలన కూడా సాఫీగా జరగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. కొత్త జిల్లా పరిపాలనకు అవసరమైన భవనాలు, మౌలిక వసతులు, ఉద్యోగుల విభజనను ముందే గుర్తించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అలాగే కొత్త భవనాల నిర్మాణంపైనా ప్రణాళికలు రెడీ చేయాలన్నారు. అందుకు అనువైన స్థలాలను ఇప్పటి నుంచే గుర్తించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
కొత్త జిల్లాల విషయంలో వస్తున్న వివాదాలపైన కూడా సీఎం జగన్ స్పందించారు. అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు అలాంటి వాటిపై నిశితంగా పరిశీలన చేయాలని.. ఏదైనా ర్ణయం తీసుకునేముందు వారితో మాట్లాడ్డం అన్నది చాలా ముఖ్యమని సీఎం జగన్ అధికారులతో అన్నారు. ప్రజలతో మాట్లాడే విషయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ సూచించారు.
ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని.. అలాగైతేనే వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. వీరు కొత్త జిల్లాల్లో మౌలికసదుపాయాలు, పాలన సాఫీగా సాగేందుకు వీలుగా సన్నాహకాలను పరిశీలిస్తారని సీఎం జగన్ అన్నారు. స్థానిక సంస్థల విభజన విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని న్యాయపరంగా, చట్టపరంగా పరిశీలించాలని జగన్ సూచించారు.
సో.. మొత్తానికి ఏపీకి ఉగాది నుంచి కొత్త జిల్లాలు రాబోతున్నాయన్నమాట.