హైదరాబాద్ : మోడీపై టార్గెట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా ?

Vijaya




నాలుగురోజులుగా నరేంద్రమోడిపై టీఆర్ఎస్ పార్లమెంటులోనే కాకుండా రాష్ట్రంలో కూడా దాడులు చేస్తోంది. 2014లో జరిగిన రాష్ట్ర విభజనపై మోడి ప్రసంగం తర్వాత మంత్రులు, టీఆర్ఎస్ నేతల పదే పదే మాటల దాడులు చేస్తున్నారు. నిజానికి అవసరం లేకపోయినా మోడిపై టీఆర్ఎస్ ఎందుకు దాడి చేస్తోంది. ఎందుకంటే దీనికి ప్రధానంగా మూడు కారణాలున్నట్లు అర్ధమవుతోంది.





మొదటిదేమో మళ్ళీ తెలంగాణా సెంటిమెంటును రగిలించటం. రెండోదేమో మోడి హైదరాబాద్ పర్యటనకు వచ్చినపుడు కేసీయార్ డుమ్మా కొట్టారు. దీనిపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. అలాగే అంతకుముందు బడ్జెట్ సందర్భంగా మోడిపై కేసీయార్ నానా రచ్చ చేశారు. దానికి కమలనాదులు కూడా అంతేస్ధాయిలో కౌంటర్లు ఇచ్చారు. పైగా రాజ్యాంగాన్ని తిరిగి రాయించాల్సిన అవసరం ఉందన్న కేసీయార్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నానా గోలచేశారు.





ఇపుడు దానికి కౌంటర్ గా టీఆర్ఎస్ డైరెక్టుగా మళ్ళీ మోడినీ టార్టెట్ చేస్తున్నది. నిజానికి రాజ్యాంగాన్ని తిరిగి రాయాల్సుందన్న కేసీయార్ వ్యాఖ్యలను తప్పుపట్టాల్సిందేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే రాజ్యాంగానికి 105 సార్లు సవరణలు చేసుకున్నాం. ఇన్నిసార్లు సవరణలు చేసుకున్నపుడు ప్రస్తుత కాలమాన పరిస్ధితులకు తగ్గట్లుగా మార్చాలని డిమాండ్ చేయటంలో తప్పేమీలేదు. కేసీయార్ డిమాండ్ కు మద్దతు పెరిగితే సరి లేకపోతే డిమాండ్ డిమాండ్ గానే ఉండిపోతుందంతే.




అయినా సరే కమలనాదులు మాత్రం కేసీయార్ ను దళిత ద్రోహిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి నాలుగైదురోజులు నానా రచ్చ చేశారు. అందుకనే పార్లమెంటులో మోడి ప్రసంగాన్ని పట్టుకుని టీఆర్ఎస్ అంతేస్ధాయిలో గోల చేస్తోంది. ఇపుడు మోడి మాట్లాడిందానిలో కూడా తప్పేమీలేదు. పైగా టీఆర్ఎస్ గురించి మోడి అసలు ఏమీ మాట్లాడలేదు. అయినా మోడిని పట్టుకుని తెలంగాణా ద్రోహని, తెలంగాణా ప్రజల మనోభావాలను దెబ్బతీశారంటు రచ్చ చేస్తున్నారు. పైగా పార్లమెంటునే తప్పుదోవ పట్టించారంటు ప్రధాని మీదే సభాహక్కుల ఉల్లంఘన నోటీసివ్వటం కొసమెరుపు. మొత్తానికి టీఆర్ఎస్-బేజీపీలు దెబ్బకు దెబ్బ అనేట్లుగా వెళుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: