ఆ బాధ్యత.. చిరంజీవి, రాజమౌళికి అప్పగించిన జగన్..?

Chakravarthi Kalyan
తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రను చెప్పాల్సి వస్తే.. బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని చెప్పాల్సిందే.. అలా జక్కన్నగా పేరున్న రాజమౌళి చరిత్ర సృష్టించాడు.. ఒక్క సినిమాతో తెలుగు సినిమా రేంజ్‌ను పెంచేశాడు.. ఇప్పుడు ఏ సినిమా రికార్డుల గురించి మాట్లాడాలన్నా బాహుబలి రికార్డ్.. నాన్ బాహుబలి రికార్డ్ అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. దేశంలోనే అత్యధికంగా రికార్డులు సాధించిన సినిమాగా రాజమౌళి బాహుబలి రికార్డులు సృష్టించింది. ప్రభాస్ లాంటి హీరోను హిందీ తెరకు పరిచయం చేసి అతన్ని పాన్ ఇండియా స్టార్‌ను చేసింది.


అయితే.. బాహుబలి తర్వాత తెలుసు సినిమాల విడుదల ట్రెండ్ కూడా మారింది. ఓ భారీ సినిమా వచ్చినప్పుడు దాదాపు నూటికి 90 శాతం థియేటర్లు ఆ సినిమాయే ఆడుతోంది. మొదటి వారంలోనే పెట్టుబడులు వచ్చేలా ఈ పరిణామం సహకరిస్తోంది. అలా నాలుగైదు భారీ సినిమాలు వస్తే.. ఇక థియేటర్లన్నీ వాటితోనే నిండిపోతాయి. ఈ భారీ బడ్జెట్‌ సినిమాల నడుమ.. మంచి కథ కథనంతో నిర్మితమయ్యే చిన్న సినిమాలు నలిగిపోతున్నాయి.


చిన్న సినిమా ఎంత బాగున్నా..అది అసలు థియేటర్లో ఆడితే కదా.. ఆ విషయం ప్రేక్షకులకు తెలిసేది. మరి ఈ చిన్న సినిమాల పరిస్థితి ఏంటి.. సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది అవకాశాలు కల్పించేది ఇలాంటి చిన్న సినిమాలే.. సినిమా టికెట్ల రేట్లు భారీగా పెంచినా ఈ చిన్న సినిమాలకు నష్టమే.. అందుకే ఈ చిన్న సినిమాల విడుదల సమస్యకు ఓ పరిష్కారం దొరకాల్సి ఉంది. నిన్న సినీ పరిశ్రమ పెద్దలు సీఎం జగన్‌ తో సమావేశం అయినప్పుడు ఈ సమస్య కూడా చర్చకు వచ్చిందట.


ఈ సమస్య గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్న జగన్.. ఇండస్ట్రీ అంటే అందరూ బతకాలి.. అన్ని రకాల సినిమాలు ఆడాలి.. అందుకు పరిష్కార మార్గం మీరే ఆలోచించాలని సూచించారట. మీరు ఓ పరిష్కార మార్గంతో వస్తే.. దాన్ని అమలు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారట. అలా చిన్న సినిమాల విడుదల సమస్యను పరిష్కరించే బాధ్యతను జగన్.. చిరంజీవి, రాజమౌళికి అప్పగించినట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: