జగనన్న : చంద్రబాబుకు ఝలక్ ? మళ్లీనా!
తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక రీతిలో తన వైఖరిని మార్చుకోవడం తో వివాదం ఆరోజు తలెత్తింది. ఆరోజు చంద్రబాబు హోదా అన్నది సంజీవని కాదని తేల్చేశారు. తర్వాత ప్యాకేజీ ప్రకారం నిధులు అందుకున్నారు అయితే ఆ రోజు కేంద్రంతో టీడీపీకి ఉన్న సఖ్యత రీత్యా ప్యాకేజీ కి సంబంధించి నిధులను బీజేపీ వెనువెంటనే విడుదల చేసింది. అయితే ఆ డబ్బులు కొంతమేర దుర్వినియోగం అయ్యాయని విమర్శలు మరియు అభియోగాలు వినవచ్చాయి.
తర్వాత మారిన ఈ పరిణామాల రీత్యా టిడిపి తన స్టాండ్ మార్చుకుంది బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. కేంద్రంతో విభేదాలు తరువాత టిడిపి మళ్లీ హోదా విషయమై ఢిల్లీ కేంద్రంగా నిరసనలు వ్యక్తం చేసింది. అయితే ఈ నిరసనలు ఏవి ఫలించలేదు. కాలగతిలో జగన్ అధికారంలోకి వచ్చాక పరిణామాలు అన్నవి మారుతూ వచ్చాయి.ఇప్పుడు కేంద్రం ప్రత్యేక హోదా విషయమై రాష్ట్రానికి వరమందిస్తే చంద్రబాబుకు ఝలక్ తగలడం ఖాయం.ఈ నేపథ్యంలో మారుతున్న పరిణామాలు కొత్త రాజకీయాలకు కారణం కానున్నాయి.