అమరావతి : కేంద్రం ఎందుకు యూటర్న్ తీసుకుంది ?

Vijaya


ఇపుడిదే అంశం ఎవరికీ అర్ధం కావటంలేదు. తెలుగురాష్ట్రాల మధ్య ఈనెల 17వ తేదీన విభజన హామీల అంశాలపై కీలకమైన సమావేశం జరగబోతోందని కేంద్రమే ప్రకటించింది. ఇందులో చర్చించబోయే తొమ్మిది అంశాల్లో ప్రత్యేకహోదాతో పాటు అనేక ఆర్ధికపరమైన అంశాలు కూడా ఉన్నట్లు ప్రకటించింది. అయితే రాత్రయ్యేసరికి మొత్తం సీనంతా మారిపోయింది. ప్రత్యేకహోదా అంశంతో పాటు ఆర్ధికపరమైన అంశాలను తొలగించినట్లు ప్రకటించింది.



ఉదయం నుండి రాత్రికి మధ్య తెరవెనుక  ఎలాంటి డెవలప్మెంట్లు జరిగిందో అర్ధం కావటంలేదు. ముందేమో ప్రత్యేకహోదా అంశం కూడా చర్చలో ఉంటుందని చెప్పింది కేంద్రమే. రాత్రకి అజెండాను మార్చేసిందీ కేంద్రమే. సమావేశంలో చర్చించే అంశాల జాబితాను కేంద్రం తొమ్మిది నుండి ఐదుకు ఎందుకు కుదించేసిందో అర్ధం కావటంలేదు. కచ్చితంగా రాజకీయ పరమైన డెవలప్మెంట్లు ఏవో జరిగి ఉండకపోతే ఇంత అర్జంటుగా అజెండాను మార్చేయాల్సిన అవసరం లేదు. ఏమి జరిగిందనేదే ఎవరికీ అర్ధం కావటంలేదు. 



ఒక విధంగా చూస్తే ప్రధానమంత్రిగా నరేంద్రమోడి ఉన్నంతవరకు  ఏపీకి హోదా రాదని అందరు మానసికంగా ప్రిపురైపోయారు. ఏదన్నా అద్భుతం జరిగింతే అంటే మోడికి ఏదన్నా రాజకీయ అనివార్యత తెలెత్తితే తప్ప  ఏపీకి హోదా వచ్చే అవకాశం లేదని అందరు అనుకున్నారు. అయితే సందర్భం వచ్చినపుడల్లా జగన్+ఎంపీలు ప్రత్యేకహోదా అంశంపై ఒత్తిడి పెడుతునే ఉన్నారు. వీళ్ళ ఒత్తిడికి మోడి లొంగే రకం కాదు కాబట్టి హోదా రాదనే అనుకున్నారు. ఈమధ్యనే పార్లమెంటులో నరేంద్రమోడి అసందర్భంగా విభజన అంశాన్ని లేవనెత్తిన విషయం గుర్తుండే ఉంటుంది.



మోడి విభజనపై మాట్లాడటం, శనివారం హఠాత్తుగా కేంద్ర నిర్ణయం చూసేటప్పటకి ఏపీలో జనాలంతా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే తెరవెనుక ఏమి జరిగిందో తెలీదు కానీ మొత్తం అజెండానే మారిపోయింది. ప్రత్యేకహోదా లేదన్నారు, ఆర్ధిక అంశాలపై చర్చే ఉండదన్నారు. ఈ సమావేశం కేవలం రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించేదుకు మాత్రమే అని కేంద్రం చావుకబురు మెల్లిగా చెప్పింది. దాంతో జనాలంతా ఉసూరమన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: