కల్యాణ్ కొత్త కాన్సెప్ట్?
అసలు టీడీపీ-వైసీపీలకు ధీటుగా జనసేన ఎదగలేకపోయింది.. అలాగే ఆ పార్టీకి బలమైన క్యాడర్ పెరగలేదు. ఇలాంటి పరిస్తితుల్లో ఉన్న పార్టీని గాడిలో పెట్టడానికి పవన్ రెడీ అయ్యారు. ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అలాగే కేవలం ఒక్క కాపు కులంపైనే ఆధారపడి రాజకీయం చేయకుండా, ఇతర వర్గాల మద్ధతు కూడా దక్కించుకోవాలని పవన్ చూస్తున్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీల మద్ధతు పెరిగేలా పవన్ ప్లాన్ చేసి...కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టనున్నారు.
అలాగే కులాల వారీగా ఉన్న సమస్యలు తెలుసుకుని వాటిపై పొరాడి..వారి మద్ధతు పెంచుకోవాలనే దిశగా పనిచేయనున్నారు. ఇదే క్రమంలో జనసేన శ్రేణులు సైతం కొత్త కాన్సెప్ట్‌తో ముందుకొస్తున్నారు...పవన్ అండ్ పవర్ అనే కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు...అంటే పవన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని ప్రచారం చేయనున్నారు.
గతంలో జాబు కావాలంటే బాబు రావాలి అని టీడీపీ సక్సెస్ అయిన విషయం తెలిసిందే...కావాలి జగన్...రావాలి జగన్, బై బై బాబు అంటూ వైసీపీ సక్సెస్ అయింది..ఇప్పుడు జనసేన పవన్ అండ్ పవర్ అని ప్రచారం చేయనుంది. కాకపోతే వైసీపీ-టీడీపీలు సక్సెస్ అయినట్లు జనసేన సక్సెస్ అవ్వడం కష్టం...ఎందుకంటే జనసేనకు పూర్తి బలం లేదు. బలం పెంచుకుంటేనే జనసేన శ్రేణుల నినాదం సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు.