పుల్వామా దాడికి మూడేళ్లు.. అమరవీరులకు మా అశ్రు నివాళులు..

Satvika
భారత దేశాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన ఘటన పుల్వామా ఉగ్రదాడి.. ఈ దాడి జమ్మూ కశ్మీర్‌లో 2019 ఫిబ్రవరి లో ఇదే రోజున జరిగింది. ఈరోజు ప్రేమికుల రోజు అయితే మరో విషాద సంఘటన ఈ దాడి..ఈ ఘటన గురించి తలుచుకుంటే ప్రతి భారత పౌరుదికి కంటతడి ఆగదు. ఆ ప్రాంతం మొత్తం వీర జవాన్ల  నెత్తురు తో ఎరుపు రంగు పూసుకుంది.పాకిస్థాన్ ముష్కరులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు.సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కి చెందిన 40 మంది సైనికులు ప్రాణాలును పోగొట్టుకున్నారు..


2019 సంవత్సరం లో ఫిబ్రవరి 14 సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన వెలుగు చూసింది.జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ముష్కరులు కాపు కాసి ఈ ఘాథుకానికి పాల్పడ్డారని తెలుస్తుంది. ఈ దాడికి యత్నించిన ప్రధాన ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ కూడా హతమయ్యాడు.సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను టార్గెట్ చేసిన అతను పథకం ప్రకారం తను కారును అడ్డుగా పెట్టి ఒక్కసారిగా దాడికి దిగాడు.మొదటి బస్సును దాటుకుంటూ ఎడమ వైపు నుంచి ఐదో వాహానాన్ని ఢీకొట్టాడు.. దాంతో ప్రమాదం జరిగింది.


ఇకపోతే జమ్మూ-శ్రీనగర్‌ రహదారిలో లెత్‌పోరా వద్ద రోడ్డు కొంచెం వంగిన విధంగా ఉంటుంది.. ఆ ప్రాంతం లో ఎటువంటి వాహానాలు అయిన కూడా నెమ్మదిగా వెల్థాయి. అదే అదునుగా చుసుకున్నా ఉగ్రవాదులు దాడికి దిగారు.ఉగ్రవాది 78 వాహనాల కాన్వాయ్‌లోని 5వ బస్సును లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి కి తెగించారు. ఇకపోతే అక్కడ ఎటువంటి నిఘా కెమరాలు లేకపోవడం వాళ్ళకు ప్లస్ పాయింట్ అయ్యింది..పుల్వామా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులందరినీ భారత సైన్యం వేర్వేరు ఎన్ కౌంటర్లలో అంత మొందించారు. ప్రతీకారం తీర్చుకున్నా కూడా ఈరోజు వస్తే ఈ దాడి అందరినీ ఉలిక్కి పడేలా చెస్తుంది. మూడేళ్లు గడిచిన కూడా ఆ భయంకర సంఘటన అందరినీ కదిలించింది వేస్తుంది..ఈ దాడి లో వీర మరణం పొందిన అమర జవానులకు మా చానెల్ తరపు నుంచి అశ్రు నివాళి అర్పిస్తున్నాము.. జైహింద్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: