కాంగ్రెస్ ప‌త‌నానికి కార‌ణం వాళ్లే..ఓ యోగి ఆత్మ వ్య‌థ


వాలంటైన్స్ డే రోజున కాంగ్రెస్ పార్టీ పై ఓ సిఎం చేసిన వ్యాఖ్యలు సహజంగానే కాక పుట్టించాయి. ఏనుగు తన నెత్తిన నానే చెత్త వేసుకుంటుంది. అదే చందాన కాంగ్రెస్ పార్టీని ఎవరూ భూస్థాపితం చేయనవసరం లేదు. వాళ్లే  తమ పార్టీ పతనానికి కారణం అని ముఖ్యమంత్రి విమర్శల దాడి చేశారు.  ఇంతకీ ఎవరాయన ?
ఉత్తర భారతాన  గోవా, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ తదితర ప్రాంతాలలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నేత యోగి ఆదిత్యనాథ్  కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేశారు. రెండోదశ పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సహజంగానే రాజకీయ వర్గాలలో హీట్ ను పెంచాయి. సుధీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు అన్నాచెల్లెళ్లు  ఇద్దరూ చాలని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. పేరు చెప్పకుండా ఆయన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వద్రాలపై విమర్శల వర్షం కురుపించారు. సామాన్య జనం బాగోగులు పట్టించుకోని రాజకీయ పార్టీలకు  ప్రజలు ఎందుకు పట్టం కట్టాలి అని కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎనభై శాతం మంది భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని, మిగిలిన ఇరవై శాతం మంది కూడా ఇతర పార్టీల వైపు ఉన్నారని యోగి  పునరుద్ఘాటించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై  తానెప్పుడూ కట్టుబడి ఉంటానని ఆయన ఈ సందర్భంగా పేర్కోనడం విశేషం. తాను ఏమి మాట్లాడినా  కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు విపరీతార్థాలు తీస్తారని యోగి ఆరోపించారు. గతంలోనూ యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పార్టీ అధినేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతల పై విమర్శలు చేశారు. అన్నా చెల్లెళ్ల మధ్య గొడవలున్నాయంటూ యోగి చేసిన వ్యాఖ్యలు దుమారాన్నే లేపాయి. నాటి విమర్శలను ప్రియాంక గాంధీ ఖండించారు. తానెప్పటికీ రాహుల్ వెంటే ఉంటానని వద్రా స్పష్టం చేశారు. యోగి తాజా  మీడియా సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. అయితె ఎక్కువగా కాంగ్రెస్ పైనే విమర్శలు చేయడం గమనార్హం. వాలంటైన్స్ డే రోజున యోగి ఆదిత్యనాథ్ కు కాంగ్రెస్ పార్టీ పై ప్రేమ పుట్టిందని నెటిజన్లు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పతనం పై యోగి బాధపడటం ఏమిటని వారు ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: