ఆదిలాబాద్ : కలకలం రేపుతున్న కులబహిష్కరణ ?

Purushottham Vinay
ఇక స్వాతంత్య్రం వచ్చి చాలా సంవత్సరాలు అయిన ఇంకా చాలా మందికి కుల పిచ్చి పోలేదు.ఇంకా కొన్ని ఊళ్లలో కుల పిచ్చితో మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.ఇక ప్రపంచం ఆధునీకీకరణ వైపు పరుగులు పెడుతున్నా… మారుమూల ప్రాంతాల్లో కులవివక్ష జాఢ్యం తన ఉనికిని ఇంకా చూపుతునే ఉంది. తమ కంటే తక్కువ కులానికి చెందిన వారని ఇంకా ఒకే కులంలో ఏర్పడే విభేదాలు మానవ సంబంధాలను చెరిపేస్తోంది.ఇక తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో కులబహిష్కరణ అనేది కలకలం రేపింది. ఖోడద్ గ్రామంలోని 12 మత్స్యాకార కుటుంబాలపై సంఘం పెద్దలు కులబహిష్కరణ వేటు వేయడం జరిగింది. మూడేళ్లుగా నరకం చూసిన బాధితులు, ఇక వేధింపులు తాళలేక మీడియా వర్గాలను ఆశ్రయించడం జరిగింది. తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. బాధితుల పరిస్థితిని చూసి చలించిన ఓ మీడియా ఈ ఘటనపై కులపెద్దలను వివరణ కోరింది. అయితే వారి నుంచి నిర్లక్ష్యపూరిత సమాధానం అనేది రావడం గమనార్హం.


ఇక తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో 12 మత్స్యకార కుటుంబాలపై సంఘ పెద్దలు కుల బహిష్కరణ వేటు వేయడం జరిగింది. ఇక గ్రామంలో 72 కుటుంబాల్లో 12 కుటుంబాలను వారు వెలివేశారు. వారు శుభకార్యాలకు ఇంకా చావులకు వెళ్లకూడదని అక్కడి సంఘం పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. ఈమధ్య కాలంలో వారి వేధింపులు ఎక్కువయ్యాయని, మూడేళ్లుగా నరకం చూస్తున్నామని బాధితులు మీడియాని ఆశ్రయించారు. ఇక కుల బహిష్కరణ విషయంలో ఖోడద్ మత్స్యకార సంఘం పెద్దలను మీడియా వాళ్ళు ఆరా తీయగా.. తాము వారిని కుల బహిష్కరణ చేయలేదని ఇంకా సంఘ భవనం నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వలేదని, ఇక అందుకే ఆ 12 కుటుంబాలను దూరంగా ఉంచామని వారు చెప్పారు. ఇక కులంలో తిరిగి చేరాలంటే జరిమానా కట్టాల్సిందేనని వెల్లడించడం అనేది గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: