షాకింగ్ : అసోంలో కెసిఆర్ పై కేసు?

praveen
పుల్వామాలో సైనికుల వాహనంపై అటు ఉగ్రవాదులు ఆత్మాహుతికి పాల్పడిన ఘటన దేశాన్ని మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఇక ఈ ఆత్మహుతి దాడి నేపథ్యంలో ఇక భారత ఆర్మీ ఒక్కసారిగా విజృంభించింది .  ప్రభుత్వ ఆదేశాలతో నిమిషాల వ్యవధిలోనే సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇక ఈ సర్జికల్ స్ట్రైక్ ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది అనే చెప్పాలి. ఇక భారత రక్షణ విషయంలో ఎక్కడా వెనకడుగు వేసేది లేదు అని ఈ సర్జికల్ స్ట్రైక్ ద్వారా ప్రభుత్వం చెప్పింది. ఇటీవల ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా దాడి ని గుర్తు చేసుకుంటూ సర్జికల్ స్ట్రైక్ గురించి చర్చించుకున్నారు అందరూ.


 ఈ క్రమంలోని స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేసింది అన్నదానికి ఫ్రూఫ్ ఏంటి అంటూ అడగడం సంచలనంగా మారింది  ఇక ఇదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కేంద్రం సర్జికల్ స్ట్రైక్ చేసింది అన్న దానికి ప్రూఫ్ చూపించాలి డిమాండ్ చేశారు. సర్జికల్ స్ట్రైక్ అని బీజేపీ చెప్పుకుంటున్నప్పటికీ అది కేవలం ఒక పొలిటికల్ స్టంట్ అని మాత్రమే దేశంలో సగం మంది నమ్ముతున్నారు అంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ సర్జికల్ స్ట్రైక్ ఆధారాలను బయట పెట్టాలి అంటూ కోరడంలో తప్పేమీ లేదు అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.



 అయితే ఇక కెసిఆర్ వ్యాఖ్యలపై అటు బీజేపీ నేతలు అందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇక సర్జికల్ స్ట్రైక్ కు సంబంధించి సైనికులను అవమానించారంటూ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అసోం లో కేసు నమోదయింది. అసోం బిజెపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైనికులను అవమానిస్తూ మాట్లాడిన కేసీఆర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బిజెపి నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: