సైకిల్ తొక్కలేనంటున్న సీనియర్?
ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు సైతం ఈ సారి పోటీ చేయడం తన వల్ల కాదని అంటున్నారు. ఈయన నిడదవోలు బాధ్యతలు చూసుకుంటున్న విషయం తెలిసిందే...మామూలుగా నిడదవోలు టీడీపీ కంచుకోట..అలాగే 2009, 2014 ఎన్నికలో టీడీపీ నుంచి బూరుగుపల్లి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం జగన్ గాలిలో ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉంటూ నిడదవోలులో పార్టీ కార్యక్రమాలు చేయడం లేదు.
ఏదో అప్పుడప్పుడు మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు..వయసు మీద పడటంతో కాస్త యాక్టివ్ గా ఉండటం తగ్గించారు..అలాగే కార్యకర్తలని వెనుకేసుకుని తిప్పడం కూడా ఇబ్బంది అయిపోతుంది. ప్రస్తుత రాజకీయాల్లో ప్రతిరోజూ కార్యకర్తలకు ఖర్చు పెట్టి, వారిని వెనుక తిప్పుకోవడం చాలా కష్టమైన పని...ఆర్ధికంగా బలంగా ఉంటేనే ఆ పని చేయలేరు. కానీ శేషారావు ప్రతిపక్షంలోకి వచ్చాక ఆర్ధికంగా కూడా వీక్ అయ్యారు. దీంతో అనుకున్న విధంగా నిడదవోలులో పనిచేయలేకపోతున్నారు.
అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని టీడీపీ అధిష్టానానికి చెప్పేశారట...కానీ నిడదవోలులో ఉండే టీడీపీ కార్యకర్తలు మాత్రం శేషారావు పోటీ చేస్తేనే బెటర్ అని అంటున్నారట. ఆయన కాకుండా వేరే నాయకుడు పోటీ చేస్తే రాజకీయంగా ఇబ్బంది పడాలని సూచిస్తున్నారట. ఇక శేషారావు తప్పుకుంటే నిడదవోలు సీటు దక్కించుకోవాలని పలువురు నేతలు ట్రై చేస్తున్నారట. కాకపోతే టీడీపీ అధిష్టానం ఇంకా శేషారావుపైనే ఆశలు పెట్టుకుంది...చూడాలి మరి నెక్స్ట్ ఎన్నికల్లో నిడదవోలు బరిలో బూరుగుపల్లి శేషారావు సైకిల్ని తొక్కగలరో లేదో?