జ‌గ‌న‌న్న : మ‌రో వివాదంలో రోజా? చేదు త‌ప్ప తీపి లేదే!

RATNA KISHORE
ఒన్ టైమ్ సెటిల్మెంట్ (ots) పేరిట జ‌గ‌నన్న తీసుకువ‌చ్చిన ప‌థ‌కం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తాము అంగీక‌రించ‌మ‌ని చెబుతున్నారు ల‌బ్ధిదారులు.అంతేకాదు ఈ వివాదం ఒక‌ప్పుడు చ‌ల్లారింది అని అనుకున్నా మ‌ళ్లీ ఇది రేగుతోంది. ఎప్పుడో క‌ట్టుకున్న ఇళ్లు త‌మవ‌ని వీటిపై ఇప్పుడు వ‌చ్చి హ‌క్కుల పేరిట రాద్ధాంతం ఎందుకు చేస్తున్నార‌ని ప్ర‌జాప్ర‌తినిధుల‌ను నిల‌దీస్తున్నారు.దీనిపై ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ల‌బ్ధిదారుల‌కు స‌ర్దిచెప్పేందుకు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండా పోతోంది. మ‌రోవైపు టీడీపీ కూడా ల‌బ్ధిదారులెవ్వ‌రూ ఓటీఎస్ క‌ట్ట‌న‌వ‌స‌రం లేద‌ని చెబుతోంది.తాము అధికారంలోకిరాగానే సంబంధిత బ‌కాయిలు అన్నీ ర‌ద్దు చేస్తామ‌ని అంటున్నారు ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు. ఇదే ఇప్పుడు పెను వివాదాల‌కు కార‌ణం అవుతున్నాయి. టీడీపీ నేరుగా నిర‌స‌న సంబంధిత కార్యాచ‌ర‌ణ‌లో లేకున్నా తెర‌వెనుక ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యేల‌ను ఇర‌కాటంలో పెట్టేందుకు యోచిస్తున్నారని,అవి స‌ఫ‌లీకృతం అవుతున్నాయి కూడా అని అంటున్నారు అధికార పార్టీ నాయ‌కులు.ఇదే వారి త‌ర‌ఫు ప్ర‌ధాన ఆరోప‌ణ.ఈ నేప‌థ్యంలో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ శాస‌న స‌భ్యురాలు రోజా కు సంబంధించిన వార్త ఇది.ప్రాథ‌మిక  స‌మాచారం ప్ర‌కారం వివ‌రాలిలా..

వివాదాస్ప‌ద ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభ‌వం ఎదురైంది.ఇవాళ ఆమెను ఓటీఎస్ ఎందుకు చెల్లించాలంటూ కొంద‌రు ల‌బ్ధిదారులు నిల‌దీశారు. నిద్ర మండలం నగరం పంచాయతీ అగరం పేటలో ‘మీతో మీ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా ఆమెకు ఈ అనుభ‌వం ఎదురయింది.దీంతో ఆమె ఒక్క‌సారిగా దిగ్బ్రాంతికి గుర‌య్యారు.గ‌తంలో కూడా ఇటువంటి అనుభ‌వాలే ఆమెకు ఉన్నాయి. అయితే వాటికి భిన్నంగా ప్ర‌భుత్వం తీసుకున్న ఓ పాల‌న సంబంధ నిర్ణ‌యంపై రోజాను ల‌బ్ధిదారులు నిల‌దీయ‌డం విశేషం.ఎందుకంటే ఆ నిర్ణ‌యానికీ, దాని వెనుక ఉన్న నేప‌థ్యానికీ రోజాకు సంబంధం లేకున్నా ల‌బ్ధిదారులు మాత్రం త‌మ ప్రాంత ఎమ్మెల్యేకు ఇవ‌న్నీ ఎందుకు ప‌ట్ట‌వు అన్న పంతంలో భాగంగా ఆమెపై సీరియ‌స్ అయ్యారు.


ఓటీఎస్ లో భాగంగా గృహ నిర్మాణ హ‌క్కులు పొందేందుకు తాము ఎందుక‌ని ప‌దివేలు చెల్లించాల‌ని ల‌బ్ధిదారులు రోజాను ప్ర‌శ్నించారు. దీనిపై ప్ర‌భుత్వం  తీసుకున్న నిర్ణ‌యాల‌పై విశ్లేష‌ణాత్మ‌కంగా చెప్పే ప్ర‌య‌త్నం ఆమె చేసిన‌ప్ప‌టికీ ల‌బ్ధిదారులు వినిపించుకోలేదు దీంతో ఆమెకు వ్య‌తిరేకంగా నినాదాలు చేసి ఆమెను ఉద్దేశించి గో బ్యాక్ అని చెప్పారు. న‌గ‌రి ప్రాంతంలో ఎక్కువ‌గా త‌మిళులు ఉండ‌డంతో వారికి ఆ ప్రాంత భాష‌లోనే చెప్పే ప్ర‌య‌త్నం ఒక‌టి రోజా చేసినా కూడా ఆఖ‌రి వ‌ర‌కూ అది ఫ‌లితం ఇవ్వ‌లేదు.దీంతో ఆమె తీవ్ర ప‌రాభ‌వంతో వెనుదిరిగారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: