మొన్న విమర్శలు.. ఇప్పుడు బర్త్ డే విషెస్.. ఏంటో ఈ రాజకీయం?

praveen
రాజకీయాల్లో పైపైకి విమర్శలు చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఒకటే అనే భావన ఉంటుంది ప్రతి ఒక్కరిలో . కొన్ని ఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే అప్పటివరకూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకునేవారు. ఆ తర్వాత మాత్రం కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటివి చూసినప్పుడే రాజకీయం అంటే ఇంత దారుణంగా ఉంటుందా అనిపిస్తూంటుంది. ఇంతకీ ఇప్పుడు రాజకీయం కోసం ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అనే కదా మీ డౌట్.. కెసిఆర్ మోడీ కారణంగా ఈ చర్చ వచ్చింది.


 ఇటీవలి కాలంలో బీజేపీ టీఆర్ఎస్ అన్న విధంగా తెలంగాణ రాజకీయం నడుస్తుంది. బిజెపి నేతలపై విమర్శలు చేస్తున్న టిఆర్ఎస్ అటు కేంద్రంలో ఉన్న మోదీ సర్కారును కూడా వదలకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మొన్నటికి మొన్న  ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలతో బీజేపీ పై విరుచుకుపడ్డారు. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ఒక పొలిటికల్ డ్రామా అని.. ప్రజలను నమ్మించేందుకు మోదీ సర్కారు ఇక ఈ పొలిటికల్ స్టెంట్ చేసింది అంటూ విమర్శలు చేశారు. మీకు దమ్ముంటే ప్రూఫ్స్ చూపెట్టాలి అంటూ వ్యాఖ్యానించారు కెసిఆర్. ఇది కాస్త ఒక పెద్ద వివాదంగా మారి పోయింది.



 ఇక ఇలా మొన్నటివరకు మోడీ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన కేసీఆర్కు ప్రేమతో బర్త్ డే విషెస్ చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కెసిఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇది కాస్త ఆసక్తిని సంతరించుకుంది. మొన్నటివరకు కెసిఆర్ మోడీపై విరుచుకుపడుతూ విమర్శలు చేస్తే ఇక ఇప్పుడు మోడీ ఎంతో కూల్గా బర్త్ డే విషెస్ చెప్పడం ఏంటి.. ఏంటో ఈ రాజకీయ మాత్రం అస్సలు అర్థం కాదు అని అనుకుంటున్నారు ఎంతోమంది. ఏదేమైనా మోడీ కెసిఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పడం మాత్రం ఆసక్తిని సంతరించుకుంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: