ఏపీ థియేటర్ టికెట్ల ధరలపై బిగ్ అప్డేట్...

VAMSI
గత కొన్ని రోజులుగా ఏపీ లో థియేటర్ టికెట్ల ధరల సమస్య తగ్గింపు టాలీవుడ్ ని ఒక కుదుపు కుదిపేసింది అని చెప్పాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్ లో కొన్ని థియేటర్ లు కూడా ఆ ధరలతో సినిమాలను నడపలేమని మూసి వేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి సినిమా పరిశ్రమ లో గ్రూప్ ల వారీగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. అయితే ఏపీ ప్రభుత్వం కూడా ఎక్కడా తగ్గేదేలే అంటూ అందరి విమర్శలకు కౌంటర్ ఇస్తూ వచ్చింది. ఒకానొక సమయంలో రామ్ గోపాల్ వర్మ ప్రభుత్వం చర్చలకు వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. సినీ పరిశ్రమలో పెద్ద నిర్మాతలు సైతం ముందుకు రాకుండా గమ్మగుండిపోయారు.
అటువంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి రెండు మూడు సార్లు సీఎం జగన్ ను కలిసి పరిస్థితిని వివరించి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించారు. ఆ శ్రమ ప్రయత్నమే గత వారంలో సినిమా పరిశ్రమ నుండి కొందరు వెళ్లి ఏపీ ప్రభుత్వాన్ని కలిశారు. దానితో టాలీవుడ్ కు ఒక ఆశ వచ్చింది. అయితే దానికి సంబంధించిన కొన్ని విషయాలను ఏపీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దానికి ఈ రోజు సినిమా టికెట్ల కమిటీ ఒక క్లారిటీ ఇవ్వనుంది. అయితే ఇందుకు సదరు కమిటీ ఇంతకు ముందు ఉన్న ప్రకారం కాకుండా మూడు కేటగిరీల్లో పరిశీలించింది. అలా ఇప్పుడు పంచాయితీ, మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ వారీగా టికెట్ ధరలను నిర్ణయించనున్నారు.
అంతే కాకుండా థియేటర్ వారీగా కూడా టికెట్ దొర్లాను సవరించే దిశగా నిర్ణయం వెలువడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ఇప్పటి వరకు ఉన్న మూడు క్లాస్ లను రెండు కు కుదిస్తారు అని తెలుస్తోంది. అంటే ఇకపై కేవలం ప్రీమియం మరియు ఎకానమీ క్లాస్ లు మాత్రమే ఉండనున్నాయి. ఈ ధరలు  60 : 40 రేషియో లో ఉంటాయని కమిటీ చెబుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: