అమరావతి : ఒక్క దెబ్బకు టీడీపీ నోరు మూతపడిపోయిందా ?
ఇదే విషయమై చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, వర్లరామయ్య, బోండా ఉమ లాంటి వాళ్ళు సవాంగ్ మీద ఎక్కడ లేని సింపతీ చూపించారు. తీరా చూస్తే ఇఫుడు హఠాత్తుగా వాళ్ళ నోళ్ళన్నీ మూతపడిపోయాయి. కారణం ఏమిటంటే ఇదే సావంగ్ ను ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించటమే. వచ్చే ఏడాది ఏప్రిల్లో రిటైర్ అవబోతున్న సవాంగ్ ను ఐదేళ్ళ పదవీకాలంలో నియమించింది ప్రభుత్వం. మరి టీడీపీ లెక్కల ప్రకారం సవాంగ్ ను జగన్ వాడుకుని వదిలేశారా ? లేకపోతే అందలం ఎక్కించారా ?
ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి అంటే క్యాబినెట్ మంత్రి హోదాతో సమానం. మొన్నటివరకు డీజీపీగా ఉన్న సవాంగ్ ను ఒక్కసారిగా క్యాబినెట్ హోదాతో సమానమైన పోస్టులో జగన్ నియమించారంటే అందలం ఎక్కించినట్లే లెక్క. ఈ విషయం తెలిసే చంద్రబాబు అండ్ కో నోళ్ళు ఎక్కడా లేవటంలేదు. టీడీపీ+ఎల్లోమీడియా లెక్కేమిటంటే జగన్ ఏమి చేసినా తప్పే. అసలు ఏమీ చేయకపోయినా తప్పే. అంటే జగన్ను తప్పుపట్టడమే టార్గెట్.
నిజానికి చీఫ్ సెక్రటరీ నుండి కిందస్ధాయి ఉద్యోగి వరకు బదిలీలు మామూలే. ఇంతోటి దానికి సవాంగ్ ను బదిలీ చేయగానే టీడీపీ+ఎల్లోమీడియా ఎందుకు రచ్చ చేసిందో అర్ధం కావటంలేదు. చంద్రబాబు హయాంలో ముగ్గురు డీజీపీలు పనిచేశారు. చీఫ్ సెక్రటరీ పునేత కేవలం చంద్రబాబు కారణంగానే కేంద్ర ఎన్నికల కమీషన్ ఆగ్రహానికి గురై పోస్టు పోగొట్టుకున్నారు. తాను అధికారంలో ఉన్నపుడు ఎలా వ్యవహరించారో మరచిపోయి ఇపుడు జగన్ పై ఆరోపణలు చేయటమే విచిత్రంగా ఉంది. అందుకనే చంద్రబాబు అండ్ కో ఆరోపణలకు జగన్ తనదైన శైలిలో జవాబిచ్చారు. దాంతో అందరి నోళ్ళు ఒక్కసారిగా మూతపడిపోయాయి.