ఆ గులాబీ నేతల మధ్య కోల్డ్ వార్..?

MOHAN BABU
 వారిద్దరూ అధికార తెరాస పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు. ఎప్పుడు కలిసిమెలిసి  ఉండేవారు. ఏం జరిగిందో ఏమో ఆ ఇద్దరి మధ్య ఎడమొహం పెడమొహం. ఓ రేంజ్ లో కోల్డ్ వార్ నడుస్తోంది అని టాక్.  మరి ఇద్దరి మధ్య ఎక్కడ వచ్చింది. ఎవరు ఆ నాయకులు.. తెలుసుకుందాం..?
 నల్గొండ జిల్లాలో ఇద్దరు నేతల మధ్య ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నది.  నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరిద్దరూ అధికార తెరాస నాయకులు. నల్గొండ జిల్లాలో ఒకరిమీద ఒకరు పైచేయి సాధించడం కోసం వేయని ఎత్తుగడలు లేవు.

 దీంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ చెల రేగుతోంది. రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ విజయం సాధించాలని ఆలోచనలో ఉన్నారు భూపాల్ రెడ్డి.  ఈ మేరకు ఆయన కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. ఈ సమయంలోనే  ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా  జిల్లాలో గేర్ మార్చారు. తన కొడుకు అమిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు పై వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. ఆ దిశలోనే అమిత్  కూడా నల్గొండ జిల్లాలో  విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తుండడం  లోకల్ రాజకీయం వేడెక్కుతోంది. అయితే సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నల్గొండలో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. ఇద్దరు తెరాస నాయకులే అయినా కెసిఆర్ పుట్టిన రోజు వేడుకలను ఎవరికి వారే నిర్వహించారు. దీంతో అధికార పార్టీలో ఉన్నటువంటి కేడర్లో అయోమయం నెలకొన్నది.

మరి గుత్తా వైపు వెళ్లారా, ఎమ్మెల్యే వైపు వెళ్లాలో నాయకులు తేల్చుకోలేకపోతున్నారట. కానీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాత్రం ఇద్దరి  కార్యక్రమాలకు హాజరై ఎవరినీ నొప్పించకుండా జాగ్రత్త తీసుకున్నారు. అయితే వాస్తవానికి నల్గొండ  కాంగ్రెస్ పార్టీ కంచుకోట. నల్గొండ  నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  గతంలో జరిగిన ఎన్నికల్లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం కోమటిరెడ్డిని ఓడించి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. అదేవిధంగా ఇదే ప్రాంతానికి చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. కొత్త ఇద్దరు కలిసి ఉన్నా కాని ప్రస్తుతం వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత కోల్డ్ వార్ నడుస్తుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: