అమరావతి : చంద్రబాబు వదిలేసినదాన్నే బీజేపీ పట్టుకుందా ?

Vijaya



కమలనాదుల వ్యవహారం చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాపులకు రిజర్వేషన్ అనే ఉపయోగం లేని అంశాన్ని పట్టుకుని బీజేపీ నేతలు జపం చేస్తున్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పించటానికి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగష్టునెలను గడువుగా ప్రకటించటమే పెద్ద జోక్ గా మారిపోయింది. పైగా ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు. జగన్ కు సంబందం లేని అంశంలో గడువు విధించటమే ఆశ్చర్యంగా ఉంది. 





ఎప్పుడైతే జీవీఎల్ కాపుల అంశాన్ని తెరపైకి తెచ్చారో వెంటనే బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రెచ్చిపోతున్నారు. నిజానికి కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని తప్పుడు హామీ ఇచ్చి లబ్దిపొందింది చంద్రబాబునాయుడు. తర్వాత తన హామీని నిలబెట్టుకోలేక దెబ్బతినింది కూడా చంద్రబాబే. రెండోసారి కూడా ఇదే హామీ ఇస్తే కాపులు ఎలా స్పందిస్తారో అని బయపడే 2019 చంద్రబాబు ప్రస్తావించలేదు. కాపులకు రిజర్వేషన్ అంశం కేంద్రపరిధిలోనిదే కానీ రాష్ట్రం చేయగలిగేదేమీ లేదని జగన్ స్పష్టంగా చెప్పారు.





చంద్రబాబు వదిలేసిన అంశాన్ని ఇపుడు బీజేపీ నేతలు పట్టుకోవటమే విచిత్రంగా ఉంది. కాపులకు రిజర్వేషన్ వచ్చే విషయంలో కాపు నేతలకే నమ్మకం లేదు. ఎందుకంటే కేంద్రం దగ్గర ప్రస్తావించాల్సిన అంశాన్ని బీజేపీ నేతలు రాష్ట్రంలో ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్ధం కావటంలేదు. పైగా జగన్ కు డెడ్ లైన్ విధించటం మరింత విడ్డూరంగా ఉంది. కాపులకు రిజర్వేషన్ అంశాన్ని జగన్ టేకప్ చేసే అవకాశం దాదాపు లేదు.





బీజేపీ నేతలకు నిజంగానే కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయంలో చిత్తశుద్దుంటే నరేంద్రమోడి దగ్గర ప్రస్తావించాలి. కేంద్రం నుండే ప్రొసీజర్ ను ప్రారంభం అయ్యేట్లు చూడాలి. అంతేకానీ ప్రొసీజర్ ను వదిలేసి రాష్ట్రంలో జగన్ కు వార్నింగులు ఇస్తున్నారంటేనే వీళ్ళదంతా డ్రామాని తెలిసిపోతోంది. అంటే చంద్రబాబు కాడిదింపేసిన అంశాన్ని ఇపుడు బీజేపీ టేకప్ చేసిందని అర్ధమైపోతోంది. మరి బీజేపీ సక్సెస్ అవుతుందా ? బీజేపీని కాపులు నమ్ముతారా ?





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: