"రష్యా - ఉక్రెయిన్" యుద్ధం ఖాయమా... ?

VAMSI
కొద్ది రోజులుగా రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం చోటుచేసుకుంది. గత వారం రోజులుగా యుద్ధం ఈ క్షణంలో అయినా ప్రారంభం కావొచ్చు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ యుద్ధం జరుగుతుందా లేదా ఎవరైనా చర్చలు చేసి యుద్దాన్ని ఆపుతారా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ దేశ సరిహద్దుల్లో మాత్రం పరిస్థితి చక్కబడడం లేదు. గత మూడు రోజుల నుండి రష్యా సైన్యం ఉక్రెయిన్ ను రౌండ్ అప్ చేసి ఉన్నారు. ఒకవేల యుద్ధం జరిగితే పై చేయి ఎవరిది అవుతుంది అనేది ఈ పాటికి ప్రపంచానికి తెలిసిపోయి ఉంటుంది. కానీ కొన్ని సార్లు ఊహించనివి జరగవు.
అయితే రష్యా సైన్యం ఎంత దైర్యం లేకపోతే ఉక్రెయిన్ సరిహద్దుల దగ్గర వేల సైన్యాన్ని మోహరించింది. అయితే దీనికి కారణం ఇదే అంటూ ఒక విషయం తెలుస్తోంది. ఉక్రెయిన్ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న కొందరు ఉక్రెయిన్ లో ఉంటూనే రష్యాకు సహాయం చేస్తున్నారని వార్తలు బయటకు వచ్చాయి. ఇది నిన్నటి  వరకు ఉన్న విషయం. అయితే నేడు ఉక్రెయిన్ సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడినట్లు రష్యా చెబుతోంది. ఉక్రెయిన్ కావాలనే రెచ్చగొడుతోంది అని మేము ఓపికతో ఉన్నామని రష్యా చెప్పడం ఆశ్చర్యకరం. ఒక వైపు ఈ రెండు దేశాల మధ్య సఖ్యత కుదర్చడానికి మరియు ఈ యుద్దాన్ని ఆపడానికి ప్రపంచానికి పెద్దన్న అనుకుంటున్న అమెరికా శత విధాలుగా ప్రయత్నిస్తోంది.
అయితే పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఇక రష్యా ఓపిక పట్టేలా లేదు. కానీ ఇక్కడ ఈ యుద్ధం జరిగితే ఉక్రెయిన్ పక్కన ఉన్న దేశాలు కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలా పలు సమస్యల నడుమ ఈ యుద్ధం జరగడం అవసరం అంటూ ప్రపంచ దేశాల అధ్యక్షులు ఏమీ చేయలేని పరిస్థితిలో చూస్తూ ఊరకుండిపోయారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: